»   »  2013 : స్టార్ హీరోలు-భారీ ఫ్లాఫులు...(ఫోటో పీచర్)

2013 : స్టార్ హీరోలు-భారీ ఫ్లాఫులు...(ఫోటో పీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్‌ సినిమా వస్తుందంటే ఆ హంగామా వేరు. థియేటర్లు కళకళలాడిపోతాయి. రికార్డులు బద్దలవ్వడానికి అంతకు మించిన తరుణం మరోటి దొరకదు. కాస్త పాజిటీవ్‌ టాక్‌ వస్తే చాలు... ఆ సినిమాని విజయతీరాలకు చేర్చేస్తారు అభిమానులు. అదే ఫ్లాప్ అయితే అంతే దారుణంగా ఉంటోంది పరిస్ధితి.

ఇంతకు ముందు రోజుల్లో (అంటే సెల్ ఫోన్,టెక్నాలిజీ అందుబాటులో లేని రోజుల్లో) ఇంత దారుణంగా సినిమా రిజల్ట్స్ ఇనిస్టెంట్ గా ఉండేవి కాదు. అప్పట్లో సినిమా విడుదల అయ్యాక...దాని టాక్ క్రింద సెంటర్స్ కు రావటానికి చాలా టైమ్ పట్టేంది. అలాగే సిటీలో కూడా స్ప్రెడ్ అవటానికి చాలా సమయం తీసుకునేది.

ఇప్పుడు పరిస్ధితి వేరు. ఓ రేంజిలో ఓపినింగ్స్ తెచ్చుకుని టిక్కెట్లకు బ్లాక్ లో కొట్టుకున్న జనం మార్నింగ్ షో అయిపోకుండానే సినిమా బాగోపోతే ఇంటర్వెల్ లోపే ...సెల్ లో మెసేజులు పంపేస్తున్నారు. ఇంటర్వెల్ లో తమ మిత్రులుకు ఫోన్ చేసి ఫలితాలు చెప్పేస్తున్నారు. హిట్ ఫలితం ఎంత త్వరగా వ్యాప్తి చెందుతోందో..అంతకు మించి సినిమా ఫ్లాఫుని మినిమం కలెక్షన్స్ కూడా లేకుండా నాశనం చేస్తోంది.

అందుకే మన స్టార్ హీరోల సినిమా వస్తోందంటే బాక్సాఫీసు దగ్గర వూహలు, అంచనాలు... భారీగా పెరిగిపోతాయి. వాటిని ఈ యేడాది మన స్టార్లు అందుకోగలిగారు. పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వీళ్లంతా హిట్లు కొట్టారు. వసూళ్లతో గళ్లాపెట్టె నింపేశారు. ఎన్టీఆర్‌, నాగచైతన్య, రవితేజలు ఓకే అనిపించారు. మొత్తానికి 2013లో తెలుగు చలనచిత్రపరిశ్రమ సాధించిన విజయాల్లో స్టార్ల వాటా ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలో 2013 లో వచ్చిన ఫ్లాపు చిత్రాలు ఏమిటి అని పరిశీలిస్తే...

తుఫాన్

తుఫాన్


'నాయక్‌'తో హిట్‌ కొట్టిన చరణ్‌ 'తుఫాన్‌'తో బాగా డీలా పడ్డాడు. ఈ యేడాదే విడుదల కావాల్సిన 'ఎవడు' నిరవధికంగా వాయిదా పడి... సంక్రాంతికి వెళ్లిపోయింది.

'రామయ్యా వస్తావయ్యా'

'రామయ్యా వస్తావయ్యా'


ఇక ఎన్టీఆర్‌ 'రామయ్యా వస్తావయ్యా' పూర్తిగా నిరాశపరిచింది. మొదటిరోజే నెగిటీవ్‌ టాక్‌ రావడంతో.. ఈ సినిమా తేరుకోలేకపోయింది. బాద్షా బాగుందనిపించుకున్నా ఈ సినిమా ఆ ఉత్సాహాన్ని మొత్తం ఎత్తుకుపోయింది.

'మసాలా'తో..

'మసాలా'తో..


వెంకీ కూడా 'మసాలా'తో ఓ ఫ్లాప్‌ అందుకొన్నాడు. షాడో అన్నా కలిసి రావటం లేదని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో ముందుకు వచ్చారు. అది హిట్ కొట్టింది. అదే ఉత్సాహంతో ...రామ్ ని తీసుకుని 'మసాలా' చేసారు. అదీ పెద్ద ఫ్లాఫ్ అయ్యింది.

అల్లుఅర్జున్‌ సైతం...

అల్లుఅర్జున్‌ సైతం...


అల్లుఅర్జున్‌ సినిమా వస్తోందంటే కుర్రకారులో ఆ క్రేజే వేరు. అయితే పూరి కాంబినేషన్ లో వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అది కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది.

రెండూ ప్లాపులే...

రెండూ ప్లాపులే...


ఈ సంవత్సరం... నాగార్జునకీ హిట్లు దక్కలేదు. 'గ్రీకువీరుడు', 'భాయ్‌' ఏమాత్రం అలరించలేకపోయాయి. ఆయన సినిమా లు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని నమోదు చేసాయి.

కామెడీనే కానీ...

కామెడీనే కానీ...

ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండే అల్లరి నరేష్‌ ఈ యేడాది మాత్రం హిట్టుకొట్ట లేకపోయాడు. త్రీడిలో చేసిన యాక్షన్ త్రీడి, యముడుకి మొగుడు చిత్రాలు రెండూ డిజాస్టర్ అయ్యాయి.

త్రీడీ ఫ్లాఫ్...

త్రీడీ ఫ్లాఫ్...


కల్యాణ్‌రామ్‌కీ ఈ యేడాది నిరాశే ఎదురైంది. చాలాకాలం గ్యాప్ తీసుకుని చేసిన భారీ బడ్జెట్‌తో రూపొందించిన 'ఓమ్‌' సినిమా ఆకట్టుకోలేకపోయింది. త్రీ అన్నా ఎవరూ పట్టించుకోలేదు.

రామ్

రామ్


గత సంవత్సరం కూడా ఫ్లాపుల్లో దూసుకుపోయిన రామ్ ఈ సంవత్సరం కూడా కలిసి రాలేదు. మసాలా, ఒంగోలు గిత్త చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యి రామ్ మార్కెట్ ని కూల దోసాయి.

English summary

 And that is the end of the year at the box office. It has a been quite an exciting year so far at the mid point with almost all the top stars having a release each barring one. Let’s have a look at the results of the films released so far this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu