»   » వినూత్న కథాంశంతో తథాస్తు.. సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం..!

వినూత్న కథాంశంతో తథాస్తు.. సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హెచ్ ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో అర్జున్ తేజ్, సంతోష్, ప్రియ, వర్షిణి హీరో హీరోయిన్స్ గా తోట నాగేశ్వరరావు దర్శకత్వంలో నూతనంగా తెరకెక్కుతున్న చిత్రం తథాస్తు యూత్ ఫుల్ కథాంశంతో ఇద్దరు యువతీ యువకుల మధ్య ఉండే మానసిక బంధంతో పాటు కాలం వారి జీవితాలను ఎలాంటి మలుపులతో నడిపించిందో, ఆ ప్రయాణంలో ఆ మూడు మనసులు అన్ని మజలీలను దాటుకొని చివరకు ఎలాంటి గమ్యాన్ని చేరుకున్నారో చెప్పే ఒక వినూత్న కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్ర సాంగ్ రికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ రికార్డింగ్ థియేటర్స్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ... దాదాపు 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా... అసిస్టెంట్ డైరెక్టర్ గా పెద్ద హీరో సినిమాలకు నేను పని చేయడం జరిగింది. అలాగే 16 మెగా సీరియల్స్ కు దర్శకత్వం వహించాను. నా మేనల్లుడు అర్జున్ తేజ్ ను ఈ \'తథాస్తు\' చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నా.. మంచి కథా కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమన్, భానుచందర్, శివాజీ రాజా, ఆలీ, చలపతి రావు, ఇలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు... అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

సీనియర్ నటి కవిత మాట్లాడుతూ.. టైటిల్ చాలా ట్రెడిషనల్ గా ఉంది.. నాకు నాగేశ్వర రావు గారు 30 ఏళ్ళుగా తెలుసు... వారి నాన్న గారు నిర్మాతగా మంచి పేరు పొందినవారే... ఆయన 1980 లో రాసిన సాంగ్ ను ఈ రోజు ఈ సినిమాలో కంపోజ్ చేయడం ఆనంద కరమైన విషయం.. సాంగ్ కూడా చాలా బాగుంది... ఇందులో నేను మదర్ క్యారెక్టర్ చేస్తున్నా... ఈ సినిమాకు ఏ ఆటంకాలు రాకుండా పూర్తి చేసుకోవాలని, అందరికీ మంచి పేరు రావాలని కోరుతున్నా అన్నారు.. ఫీల్ గుడ్ మూవీకి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.. యువతకు కావాల్సిన మాస్ మసాలతో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ఇది.. ఎంటైర్ ఫ్యామిలీ చూడాల్సిన మంచి సినిమా తథాస్తు.. అని చెప్పారు.

Thadasthu movie songs recording started

డైలాగ్ రైటర్ వి.వి. వరప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ నాయిడు మాట్లాడుతూ ఈ చిత్రంలో 6పాటలు ఉన్నాయి.. నేడు సాంగ్ రికార్డింగ్ చేయడం జరిగింది.. మ్యూజిక్ హైలెట్ అవుతుందని భావిస్తున్నా అన్నారు.

హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు నా కృతఙ్ఞతలు. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం ఆదరిస్తారని కోరుతున్నా అన్నారు.
హీరో అర్జున్ తేజ్ మాట్లాడుతూ మంచి స్టోరీ.. హీరో లీడ్ రోల్ ప్లే చేస్తున్నా... కొత్త వారిని ఆదరిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో హీరో సంతోష్, ఫైట్ మాస్టర్ అహమ్మద్, ప్రభ, డీఓపీ రాజా తదితరులు పాల్గొన్నారు...

అర్జున్ తేజ్, ప్రియ, సంతోష్, సుమన్, భానుచందర్, శివాజీ రాజా, కవిత, ఆలీ, చలపతిరావు, ప్రసన్న కుమార్, శంకర్ రావు, కాకినాడ చక్రధర్, ధనరాజ్, మాస్టర్ అక్షోభ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: ఎ. రాజా, ఎడిటింగ్: నందమూరి హరి, కొరియోగ్రఫీ: ఆనంద్, జోజో, ఫైట్స్: అహమ్మద్, మాటలు: వివి ఎస్. వరప్రసాద్, రచనా సహకారం: నరేష్ ధ్యాన్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: తోట నాగేశ్వరరావు.

English summary
Thadasthu movie songs recording has started in Prasad Labs in Hyderabad. Arjun Tej and Priya are the lead actors. Suman, Bhanu Chander others are part of the movie. Thota Nageshwara Rao is the Producer and Director for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X