»   » తాగుబోతు రమేష్ దర్శకత్వంలో (షార్ట్ ఫిల్మ్)

తాగుబోతు రమేష్ దర్శకత్వంలో (షార్ట్ ఫిల్మ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాగుబోతు రమేష్ మనకు ఇప్పటి వరకు కేవలం కమెడియన్ గా మాత్రమే తెలుసుకు. కానీ అతిలోనూ రచన, దర్శకత్వం లాంటి టాలెంట్ ఉందని ఎవరికీ తెలియదు. తనకు ఇలాంటి వాటిపై ఆసర్తి ఉందని కూడా అతను ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఏకంగా ఓ షార్ట్ ఫిలిం తీసి చూపించాడు.

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగులో భాగంగా చాలా రోజులు తాగుబోతు రమేష్ లండన్లో గడిపాడు. ఆ సమయంలోనే ఓ ఆలోచన రావడం, వెంటనే స్క్రిప్టు రెడీ చేయడం, షూటింగ్ కూడా పూర్తి చేయడం లాంటివి చకచకా చేసేసాడు. ‘I Know'(నాకు తెలుసు) పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ర్ తెరకెక్కించాడు.

దీన్ని సంక్రాంతి సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేసారు. ఈ విషయమై తాగుబోతు రమేష్ మాట్లాడుతూ...'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుండగా ఒక చిన్న ఐడియా తట్టింది, దాన్నే కధగా మలిచి రెండు రోజుల్లో ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశాను. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.' అని తెలిపారు.

ఇందులో నవీన్, అమిత్ అనే తెలుగు స్టార్లతో పాటు లిజ్ అనే లండన్ భామ ముఖ్య పాత్ర పోషించింది. గణేష్ సినీ స్టూడియోస్ బేనర్లో దీన్ని తెరకెక్కించారు. శ్రీను కందుకూరి సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు. పవన్ గానలోల ఎడిటింగ్ అందించగా.... స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు తాగుబోతు రమేష్ చేపట్టారు.

English summary
Watch I Know Telugu Short Film written and directed by Popular Comedian Thagubothu Ramesh (Ramesh Ramilla).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu