»   » వివేగమ్ ఫస్ట్‌లుక్ అదిరింది.. మార్ఫింగ్ అంటూ.. అజిత్‌‌పై నయనతార

వివేగమ్ ఫస్ట్‌లుక్ అదిరింది.. మార్ఫింగ్ అంటూ.. అజిత్‌‌పై నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివేగమ్ చిత్ర ఫస్ట్ లుక్ లో తలా అజిత్ అదరగొట్టేశాడు. సిక్స్ ప్యాక్ నిలువెత్తు విగ్రహంతో ఉన్న పోస్టర్ తొలిచూపులోనే ఆకట్టుకొన్నది. రౌద్రం, తీక్షణమైన చూపులతో నిలుచున్న అజిత్ రూపం వారెవ్వా అనిపించేలా ఉంది. చక్కటి దేహదారుఢ్యంతో ఉన్న అజిత్ హాలీవుడ్ హీరోను తలదన్నేలా కనిపించాడు. దాంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆనందాన్ని పంచాడు. ఈ చిత్రానికి తొలుత తలా 57 అని ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి శివ దర్శకుడు కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అజిత్ పవర్ ఫుల్.. సోషల్ మీడియాలో హల్‌చల్
అజిత్ ఫస్ట్‌లుక్ పై దక్షిణాది చిత్ర హీరోలతోపాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొద్దిగంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో అజిత్ ఫొటో వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, నయనతార ట్విట్టర్ లో సూపర్ అంటూ స్పందించారు. తమిళంలో జేమ్స్ బాండ్ చిత్రంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంపై ప్రేక్షకులకే కాకుండా సినీతారలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ విడుదలకు సిద్ధమవుతున్న చిత్రంలో కాజల్ అగర్వాల్, అక్షరహాసన్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. వేదాలం చిత్రం తర్వాత వస్తున్న వివేగమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నయనతార, వివేక్ ఒబేరాయ్ ట్వీట్టర్‌లో ప్రశంసలు
అజిత్ అన్న తన రూపాన్ని ఊహించని విధంగా మార్చుకొన్నారు. తలా57 ఫస్ట్ లుక్ చాలా సూపర్ గా, ఇన్‌స్పైరింగ్ ఉంది అని వివేక్ ట్వీట్ చేశారు. ఇక నయనతార 'ఫస్ట్ లుక్ పవర్ ఫుల్, మాస్ నీ వా తలా' అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

ఏప్రిల్ విడుదలకు సిద్ధమవుతున్న చిత్రంలో కాజల్ అగర్వాల్, అక్షరహాసన్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. వేదాలం చిత్రం తర్వాత వస్తున్న వివేగమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం మార్ఫింగ్ చిత్రమనే ప్రచారం కూడా జరుగుతున్నది.

English summary
first look poster of Thala Ajith’s upcoming movie vivegam was unveiled. The poster features Ajith showing his fearsome side and his sculpted physique.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu