»   » 24న హీరో అజిత్ కు ఆపరేషన్

24న హీరో అజిత్ కు ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రీసెంట్ గా అజిత్ ... వేదాలం చిత్రం షూటింగ్ గాయపడ్డ సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడాయన మోకాలు ఆపరేషన్ కు రెడీ అవుతువ్నారు. చెన్నైలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో నవంబర్ 24 న ఈ ఆపరేషన్ జరగనున్నట్లు సమాచారం.

అయితే రీసెంట్ గా జరిగన ప్రమాద గాయానికి సంభందించిన నొప్పి కు చెందిన ఆపరేషన్ కాదంటున్నారు. చాలా కాలం నుంచి మోకాలు నొప్పితో అజిత్ బాధపడుతున్నారని , డాక్టర్లు ఆపరేషన్ చేస్తే బెటర్ అని సజెస్ట్ చేసారని చెన్నై సినీ వర్గాల సమచారం.

వేదాలం షూటింగ్ కు ముందే ఆపరేషన్ అనుకున్నా..వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ అనంతరం ఆయన రెండు నెలలు పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఆయన తాజా చిత్రం విశేషాలకు వస్తే..

ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్‌ థ్రిల్అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది. అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Thala Ajith To Undergo Knee And Shoulder Surgery On November 24th

'చిరుత్త్తె' శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'వేదాళం'. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో పదో తేదీన విడుదల కానున్న ఈ చిత్రం అజిత్‌ అభిమానులతో పాటు కోలీవుడ్‌ వర్గాల్లోనూ భారీ అంచనాలు రేపుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో అజిత్‌ ద్విపాత్రాభినయమా? కాదా? అనే విషయాన్ని తెరపై చూడాల్సిందేనంటూ చిత్ర దర్శకుడు శివ మరో ట్విస్ట్‌ ఇచ్చారు.

ఇక వేదాలం అంటే ఘోస్ట్ అని అర్థం. సో నెగెటీవ్ లుక్ ఉన్న హీరోగా ఈ సినిమాలో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.... ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాకపోవడంతో.. అజిత్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్సుకత నెలకొంది... టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెడ్ కలర్ కుర్తా, షార్ట్ ట్రిమ్ముడ్ హెయిర్... మెడలోనూ, చేతికి మెటల్ చైన్, చెవికి రింగ్, వేళ్లనిండా ఉంగరాలతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు అజిత్.

English summary
Recently we had reported that Thala Ajith got himself injured while shooting a fight sequence for his film Vedalam. As a result, he will now undergo a knee and shoulder surgery on November 24th at a private hospital in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu