»   » రజినీ కాంత్ కి మతిపోయిందా..?? పోయి పోయి మళ్ళీ అతని తోనే....

రజినీ కాంత్ కి మతిపోయిందా..?? పోయి పోయి మళ్ళీ అతని తోనే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజినీ కాంత్ కి మతిపోయిందా..? ఇప్పుడు కొత్త న్యూస్ విన్నవాళ్ళెవరైనా అనుకునే మొదటి మాట ఇదే. కబాలి దెబ్బ తర్వాత రజినీ అసలు మళ్ళీ పా. రంజిత్ వైపు చూస్తాడనుకోలేదెవరూ కానీ ఒక్క సారి షాక్ ఇచ్చాడు. మనకే కాదు రంజిత్ కి కూడా ఇది షాకింగే... కబాలి సినిమా చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీ అభిమానులే కాదు సామాన్య జనం కూడా రంజిత్ మీద పిచ్చి పిచ్చిగా కోపం తెచ్చుకున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంతకుముందు కూడా ఫ్లాపులున్నాయి కానీ.. వాటిలో ఆయన వరకు చాలా ఎనర్జిటిగ్గా కనిపించాడు. ఎంటర్టైన్ చేశాడు. కానీ 'కబాలి'లో మాత్రం తన కెర్తీర్ లోనే కనిపించనంత సాదాసీదాగా కనిపించాడు రజిని. అసలు కెరీర్ డిజాస్టర్ అనుకునే బాబా లో కూడా కథే తప్ప రజినీ ఫెయిల్ కాలేదు. కేవలం రజినీ స్టయిల్ చూదటం కోసమే ఆ సినిమాని ఇప్పటికీ చూస్తూ ఉంటారు ఆయన ఫ్యాన్స్.

కానీ కబాలి మాత్రం ట్రైలర్ చూసి ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్ళి "డామిడ్ కథ అడ్డం తిరిగిందేమిటీ?" అని బాగానే ఫైరయ్యారు అభిమానులు. ఇలా చూపించినందుకు అందరూ రంజిత్‌ను విమర్శించారు. రజినీ ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కానీ రజినీ మాత్రం అలా ఫీలైనట్లు లేడు. రంజిత్‌ తనను 'కబాలి'లో బాగానే ప్రెజెంట్ చేశాడని ఫీలయ్యాడో గానీ ఇలాంటి వింత నిర్ణయం తీసుకున్నాడు.

Thalaivar Rajinikanth is once again collaborating with director Pa Ranjith

ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే రంజిత్‌తో 'కబాలి' తర్వాత కూడా ఇంకో సినిమా చేయబోతున్నాడట రజిని. 'రోబో-2' తర్వాత ఆయన చేయబోయే సినిమా అదేనట. ఇదేదో గాసిప్ అంటూ కొట్టిపారేయటానికి కూదా లేదు స్వయంగా రజినీ అల్లుడు ధనుషే ఈ విషయాన్ని వెల్లడించాడు. తొలిసారి రజినీ కాంత్ తో తాను కొలాబరేట్ అవుతున్నట్లు చెప్పిన ధనుష్ . సంవత్సరం తర్వాత తాను నిర్మించబోయే సినిమాలో రజినీ హీరోగా నటిస్తాడని.. ఆ చిత్రానికి పా.రంజితే దర్శకుడని తెలిపాడు.

ఇప్పుడు రజినీ చేస్తున్న "రోబో 2.0 తర్వాత ఆ సినిమా మొదలవుతుందని చెప్పాడు. అంటే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజినీ సినిమా అన్న వార్తలన్నీ గాలి కబుర్లే అన్నమాత. 'కబాలి' సెట్స్ మీద ఉండగానే అప్పుడున్న హైప్ కి.. పా.రంజిత్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన సూర్యతో పాటు ఇంకొందరు హీరోలు ప్రస్తుతం అతడికి ముఖం చాటేస్తున్నా... రజినీకాంత్ మాత్రం ఇంకోసారి రంజిత్ తోనే సినిమా చేయటానికి ఆసక్తి చూపటం ఏమిటో...

English summary
The latest buzz that is doing rounds on social media is that superstar Rajinikanth and director Pa Ranjith are collaborating once again for a film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu