»   » పోస్టర్ చూడగానే సూపర్ కిక్ వచ్చిందట

పోస్టర్ చూడగానే సూపర్ కిక్ వచ్చిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పటికప్పుడు తన మనస్సులో భావాలను ట్వీట్ లతో తన అభిమానులకు తెలియచేసే సంగీత దర్శకుడు తమన్. ఆయన తాజాగా కిక్ 2 చిత్రం కమిటయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...కిక్ 2 పోస్టర్ ని ఫ్యాన్స్ తయారు చేసారని పోస్ట్ చేసారు. ఆ పోస్టర్ చూడగానే సూపర్ కిక్ వచ్చిందని అన్నారు.

రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రూపొందించిన కిక్ చిత్రం మంచి హిట్ ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోందని సమాచారం. ఈ సీక్వెల్ లోనూ రవితేజ హీరోగా చేస్తున్నారు. మరో హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. త్వరలో లో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఖరారు చేసారు.

Thaman about kick 2 poster

సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం హల్వా రాజ్ పాత్ర కొత్త మెలికతో అదరకొడుతుందని అంటున్నారు. అయితే ఈ కథలో మంచి లవ్ స్టోరి ఉండేలా తయారు చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం రవితేజ హీరోగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ 'పవర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న దీనికి 'అన్ లిమెటెడ్' అనే ట్యాగ్ లైన్ ని పెడుతున్నారు. టైటిల్ కి తగ్గట్లు రవితేజ పూర్తి పవర్ ని ఈ చిత్రం చూపెడుతుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ గా రవితేజ కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

English summary
Thaman tweeted:" Loved this fan made poster of #kick 2 :) compositions starting soon :) my 8th film with mass maharaj :) super kicked
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu