Just In
Don't Miss!
- News
దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జాతీయ స్థాయిలో ట్రెండింగ్.. వెల్లువెత్తుతున్న విషెస్.. తమన్ రేంజ్ అంటే అదే
క్యాపీ క్యాట్ అంటూ.. ట్యూన్‌లను కాపీ కొడతాడంటూ తమన్‌పై ఓ అపవాదు ఉంది. అయితే అవన్నీ పట్టించుకోని తమన్.. తన ప్రతిభను మెరుగుపరుచుకోవడంపై మాత్రమే శ్రద్ద పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సినిమాలను వరుసగా చేస్తున్నా.. దేనికదే ప్రత్యేకంగా ఉండేలా సంగీతాన్ని అందిస్తూ అందరి హీరోల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. నేడు తమన్ పుట్టిరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్లు హెరెత్తిస్తున్నాయి. దెబ్బకు HappyBirthdayThaman అనే హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ప్రారంభంలోనే కిక్ ఇచ్చిన తమన్..
సంగీత దర్శకుడిగా తమన్ మొదటి సినిమా కిక్. రవితేజ, ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన ఆ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో.. అందులోని సంగీతం, పాటలు అంతకు మించి జనాల్లోకి చొచ్చుకుపోయాయి. అప్పటి వరకు వచ్చిన మ్యూజిక్ కు కిక్ సినిమాలోని సంగీతానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. మెలోడిపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టే తమన్.. ఆ మూవీలోని గోరే గో గోరే అనే పాటను ఎంతో అద్భుతంగా స్వరపరిచాడు. ఆ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలిరిస్తూనే ఉంటుంది.

వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..
కిక్ ఇచ్చిన హిట్.. తమన్‌ను లైన్లో పెట్టేసింది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయాడు. అయితే స్టార్ హీరోలకు సంగీతం అందించేందుకు కాస్త సమయం పట్టింది. అయితే రవితేజతో కంటిన్యూగా సినిమాలు చేస్తూ రాగా వీరి కాంబినేషన్‌లో మిరపకాయ్, వీర, ఆంజనేయులు, నిప్పు, బలుపు లాంటి చిత్రాలు వచ్చాయి.

టాప్ స్టార్లందరితో.. బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్..
బృందావనం సినిమాతో ఎన్టీఆర్, రేసుగుర్రం సినిమాతో అల్లు అర్జున్, నాయక్ సినిమాతో రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ టాప్ స్టార్లందరితో పని చేశాడు. రీసెంట్‌గా అరవింద సమేత చిత్రంతో మరోసారి పుంజుకున్న తమన్.. ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ హవా కొనసాగుతోంది. నేపథ్య సంగీతం అందించడంలో తమన్ శైలే వేరు. చిరు అంతటి వాడికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. బ్రూస్‌లీ చిత్రానికి తమన్ అందించిన ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటికీ నిలిచిపోతుంది.

ప్రస్తుతం తమన్.. మ్యూజికల్ సెన్సేషన్
ప్రస్తుతం తమన్.. మ్యూజికల్ సెన్సేషన్‌గా మారిపోయాడు. చేతిలో వరుసగా ప్రాజెక్ట్‌లున్నా.. ఏ ఒక్కటి నిరాశపర్చకుండా అందర్నీ మెప్పిస్తూ కొత్త బాణీలను అందిస్తున్నాడు. డిస్కోరాజా, ప్రతిరోజు పండగే, అల వైకుంఠపురములో లాంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
|
రికార్డులు క్రియేట్ చేస్తోన్న తమన్ పాటలు..
సినిమాలో ఒక్కో పాట రిలీజ్ అవుతూ ఉంటే సోషల్ మీడియా వణికి పోతోంది. ఆ చిత్రం నుంచి విడుదలైన ప్రతీ పాట ఓ సెన్సేషనే.. యూట్యూబ్‌లో కొంగొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సామజవరగమన అత్యధిక లైకులు, వ్యూస్‌తో టాప్‌లో ఉండగా.. రాములో రాముల సాంగ్ ఫాస్టెస్ట్ 50మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా మరో రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన OMGDaddy సాంగ్ రికార్డుల వేట కొనసాగిస్తోంది.

తమన్‌కు శుభాకాంక్షల వెల్లువ
ఈ రేంజ్‌లో తన హవా కొనసాగిస్తున్న తమన్‌కు ఆయన అభిమానులు, సెలెబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ఫ్రాన్స్‌లో నీతో ఉన్నన్ని రోజులు అదిరిపోయాయి.. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ అంటూ తమన్‌పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రస్తుతం తమన్ బర్త్‌డే నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.