»   » రామ్ చరణ్ మూవీ నుండి తమన్ ఔట్, ఏమైంది?

రామ్ చరణ్ మూవీ నుండి తమన్ ఔట్, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Thaman opts out of ‘Govindudu Andari Vadele’
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే'. ఈ చిత్రానికి తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమన్‌ను తప్పించి తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజాను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుకు కారణం ఏమిటో తెలియరాలేదు.

కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో చెర్రీ బాబాయ్ పాత్రలో కనిపించనున్నారు. కమలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. ఏప్రిల్‌ రెండోవారం నుంచి హైదరాబాద్‌ రామానాయుడు సినీ విలేజ్‌లో ఇల్లు సెట్‌లో షూటింగ్ ప్లాన్ చేసారు. అనంతరం ఆర్‌ఎఫ్‌సిలో తదుపరి షెడ్యూల్‌ని చిత్రీకరించనున్నారు.

రామ్ చరణ్ నటించిన చివరి చిత్రం 'ఎవడు' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం తర్వత రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

English summary
Thaman was the music director for Mega Power Star Ram Charan and Krishna Vamsi's ‘Govindudu Andari Vadele’, but as per the latest reports being heard, he has opted out of the film. The movie will now have music from Yuvan Shankar Raja.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu