»   » దేవిశ్రీప్రసాద్ కాదు...తమన్‌ సీన్ లోకి !

దేవిశ్రీప్రసాద్ కాదు...తమన్‌ సీన్ లోకి !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:రామ్‌చరణ్‌ - శ్రీను వైట్ల కలయికలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఇంతకు ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుథ్‌ను ఎంపిక చేశారు. అయితే తర్వాత క్రియేటివ్ డిఫెరెన్స్ లతో తొలిగారు..దేవిశ్రీ ప్రసాద్ సీన్ లోకి వచ్చారన్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ పడింది. ఇప్పుడు ఆ స్థానంలో తమన్‌ వచ్చి చేరారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమన్ గతంలో శ్రీను వైట్లతో కలిసి బాద్షా, దూకుడు, ఆగడు చిత్రాలకు పనిచేసారు. ఇద్దరకి మంచి రాపవుట్ ఉంది. అలాగే రామ్ చరణ్ తో కలిసి తమన్ గతంలో నాయక్ చిత్రం చేసారు. మొదట గోవిందుడు అందరివాడేలా చిత్రానికి తమన్ ఉన్నారు. అయితే కృష్ణవంశీ తో క్రియోటివ్ ఢిఫెరెన్స్ లు రావటంతో తమన్ ని తప్పించి, యవన్ శంకర్ రాజాని తీసుకున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా మరోసారి తమన్ ..రామ్ చరణ్ ప్రాజెక్టులోకి వచ్చారు.

Thaman to replace Anirudh for Ram Charan's film

తమిళ చిత్రాలతో అనిరుథ్‌ బిజీగా ఉండడం వల్ల మరో సంగీత దర్శకుణ్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీంతో తమన్‌ వైపు మొగ్గు చూపాం అని చెప్తున్నారు దర్శక,నిర్మాతలు. 'నాయక్‌' చిత్రానికి తమన్‌ అందించిన బాణీలు ఆకట్టుకొన్నాయి. దాంతో పాటు శ్రీను వైట్లతోనూ తమన్‌కు ట్యూనింగ్‌ కుదిరింది. అందుకే తమన్‌కు స్వర పగ్గాలు అప్పగించారు. విజయదశమికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

సినిమా విషయానికొస్తే...

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ నేటి నుంచి హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

English summary
Now it is officially confirmed that Thaman has replaced Anirudh as the music director for Ram Charan,Srinu Vytla film.
Please Wait while comments are loading...