»   » రామ్ చరణ్ రీమేక్ చేసే మూవీ: నయనతార లవ్ సీన్ (వీడియో)

రామ్ చరణ్ రీమేక్ చేసే మూవీ: నయనతార లవ్ సీన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విలన్ పాత్ర చేసిన అరవింద స్వామినే తెలుగులో తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నారు.

‘థాని ఒరువన్' మూవీలో నయనతార, జయం రవి మధ్య వచ్చే లవ్ ప్రపోజల్ సీన్ అదిరిపోయింది. తెలుగులో ఇదే సీన్లో రామ్ చరణ్ ను ఒక్కసారి ఊహించుకోండి...

Thani Oruvan Love proposal scene Stars Jayam Ravi, Nayanthara

Thani Oruvan Love proposal scene- HD

Posted by Tamil Cinema - Filmibeat on Sunday, November 29, 2015

తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ విషయమై అతనితో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏ విషయం అనేది తేలనుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు. డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.

Thani Oruvan Love proposal scene

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. నెక్ట్స్ తాను చేయబోయే సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.

అల్లు అరవింద్ సలహా మేరకే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చాడని అంటున్నారు. థాని ఒరువన్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కేవలం కథ ఆధారంగా మాత్రమే నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రూ. 25 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించే అవకాశం ఉంది.

English summary
Check out Thani Oruvan Love proposal scene. Ram Charan to star in Telugu remake of Thani Oruvan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu