»   » రూటు మార్చిన రామ్ చరణ్, అల్లు అరవింద్ ప్లానేనా?

రూటు మార్చిన రామ్ చరణ్, అల్లు అరవింద్ ప్లానేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. నెక్ట్స్ తాను చేయబోయే సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.

తమిళంలో సూపర్ హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ‘థాని ఓరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు.

Thani Oruvan Remake: Ram Charan not to take any remuneration

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.

అల్లు అరవింద్ సలహా మేరకే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చాడని అంటున్నారు. థాని ఒరువన్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కేవలం కథ ఆధారంగా మాత్రమే నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించే అవకాశం ఉంది.

థాని ఒరువన్ తమిళ వెర్షన్ లో విలన్ పాత్రలో అరవిందస్వామి నటించారు. తెలుగులో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అరవింద స్వామి తెలుగులోనూ నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

English summary
Film Nagar source said that, Mega Power Star Ram Charan is reported of deciding not to take any remuneration for his upcoming film which is a remake of Tamil Super hit Thani Oruvan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu