twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' వివాదం మేలు చేసింది: మంచు విష్ణు

    By Srikanya
    |

    హైదరాబాద్ : గత నాలుగు రోజులుగా జరుగుతున్న తన 'దేనికైనా రెడీ' చిత్రం వివాదం తనకు చాలా హెల్ప్ చేసిందంటున్నారు మంచు విష్ణు. ఈ వివాదం వల్ల తన సినిమాకు చాలా పబ్లిసిటీ వచ్చిందంటున్నారు. వివాదం తెచ్చినవాళ్లకు ధాంక్స్. వారిని దేముడు చల్లగా చూడాలి. నాకు పబ్లిసిటీ మీద ఖర్చుపెట్టాల్సిన డబ్బులు మిగిలాయి అన్నారు. నాకు ఈ వివాదం చాలా ఫేవర్ చేసిందని వ్యాఖ్యానించారు.

    దేనికైనారెడీ సినిమాను నిషేధించాలని, తమపై దాడికి ప్రేరేపించిన సినీనటులు మోహన్‌బాబు, విష్ణులతోపాటు దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ)లో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ విషయమై మీడియా ఆయన్ని సంప్రదించిన సందర్భంగా ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేసారు.

    మోహన్‌బాబు నివాసం ముందు బుధవారం నిరసన వ్యక్తం చేసిన బ్రాహ్మణసంఘాల ఆందోళకారులపై మోహన్‌బాబు ఇంటి సిబ్బంది దాడికి పాల్పడటం, ఇద్దరు ఆందోళనకారులు గాయపడటం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో గురువారం మానవ హక్కుల సంఘంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బ్రాహ్మణ సంఘాలకు మద్దతుగా తెలంగాణ న్యాయవాదులు కూడా వచ్చారు. కేసు విచారణకు స్వీకరించిన కమిషన్‌ నవంబరు 28లోపు వివరణ ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మకు నోటీసులు జారీ చేసింది.

    తమ ఇంటిపై బ్రాహ్మణ సంఘాలు దాడి చేసినప్పుడు పనివాళ్లు, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారేగానీ దాడి చేయలేదని విష్ణు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దేనికైనారెడీ చిత్రంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న దృశ్యాలను తొలగించాలని ద్రోణంరాజు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. మోహన్‌బాబు, విష్ణు బ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మోహన్‌బాబుకు తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ న్యాయవాదులు హెచ్చరించారు. తిరుపతి నుంచి గురువారం హైదరాబాద్‌కు వచ్చిన మోహన్‌బాబును ఆయన ఇంటివద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జరిగిన ఘటనలపై స్పందించమని అడిగినప్పటికీ ఆయన మాట్లాడకుండానే ఇంట్లోకి వెళ్లిపోయారు.

    English summary
    
 "This controversy has only helped create more publicity. God bless them. Thanks to them, I have saved the money I would have had to spend on publicity. They have done me a favour":Manchu Vishnu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X