»   »  నేను తప్పు అని నిరూపించాడు: ‘ఊపిరి’పై రాజమౌళి కామెంట్

నేను తప్పు అని నిరూపించాడు: ‘ఊపిరి’పై రాజమౌళి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఊపిరి' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. ప్రెంచి మూవీ 'ఇంటచబుల్స్' చిత్రానికి రీమేక్. మార్నింగ్ షో నుండే 'ఊపిరి' చిత్రానికి పాజిటివ్ పీడ్ బ్యాక్ వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి... సినిమాపై, దర్శకుడు వంశీపై, నాగార్జున, కార్తీలపై ప్రశంసల వర్షం కురిపించారు.

  'నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇంటబుల్స్ ఒకటి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాను వంశీ సరిగా హ్యాండిల్ చేస్తాడని అనుకోలేదు. కానీ నా ఊహ తప్పు అని నిరూపించాడు. థాంక్స్ వంశీ' అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు. కార్తీ చాలా బాగా చేసాడు. నాగార్జున గారు నిజమౌన పాత్ బ్రేకర్. ఊపిరి మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే నిజమైన ఎంటర్టెనర్. ఈ సినిమాను మిస్ కావొద్దు అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

  'ఊపిరి' చిత్రాన్ని పివిపి సంస్థ రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ఈ సినిమాను ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ సినిమాకు పబ్లిసిటీ కోసం కూడా బాగా ఖర్చు పెట్టారు. ఆల్రెడీ అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

  స్లైడ్ షోలో రాజమౌళి ట్వీట్స్..

  రాజమౌళి ట్వీట్


  ఊపిరి సినిమా విషయంలో నా ఊహ తప్పు అని వంశీ నిరూపించాడు అంటూ రాజమౌళి ట్వీట్

  నాగార్జున, కార్తి గురించి


  నాగార్జున, కార్తి నటనను పొగుడుతూ రాజమౌళి ట్వీట్

  టీంకు కంగ్రాట్స్


  ఈ సందర్భంగా రాజమౌళి ‘ఊపిరి' టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

  నితిన్ ట్వీట్


  ఊపిరి సినిమా గురించి హీరో నితిన్ ట్వీట్

  English summary
  "Intouchables is one of my favourites. Frankly I didn't think Vamsi would be able to handle it. Thanks Vamsi for proving me wrong. The scenes you indianised made it a better film. Karthi is so good. Nagarjuna garu is a true path breaker. Congratulations to PV garu and the whole team. Oopiri is A true entertainer that stays with you for a long time. Don't miss it." Rajamouli tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more