»   » ప్రభాస్ సరే...మహేష్‌బాబు అయితే షాకిచ్చారు!

ప్రభాస్ సరే...మహేష్‌బాబు అయితే షాకిచ్చారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ చిన్న చిత్రం విడుదల అవుతోందంటే దానికి పెద్ద స్దాయి ప్రమోషన్ అవసరం. అటువంటిదే తను నేను చిత్రం అందుకుంటోంది. అందుకు కారణం ఈ చిత్రంలో హీరోగా నటించిన సంతోష్ శోభన్. అతనికి ప్రభాస్, రవితేజ, మహేష్ బాబు వంటి వారు విషెష్ తెలిపి సినిమాపై అందరి దృష్టి పడేలా చేసారు.

'వర్షం', 'బాబి', 'చంటి' చిత్రాలను అందించిన దర్శకుడు శోభన్‌. ఆయన తనయుడే సంతోష్‌ శోభన్‌. 'తను నేను' తో హీరోగా పరిచయమవుతున్నాడు. రామ్మోహన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. విడుదల సందర్బంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

Thanu-Nenu hero about Mahesh tweet

సంతోష్‌ మాట్లాడుతూ ''ప్రభాస్‌, రవితేజ, నాని, త్రివిక్రమ్‌ నన్ను ఆశీర్వదించారు. మహేష్‌బాబుగారైతే... ట్విట్టర్‌లో నా గురించి ప్రస్తావించి షాకిచ్చారు. వాళ్లందరి దీవెనలు అందుకొంటుంటే నాన్న మా మధ్యే ఉన్నారనిపిస్తోంది. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. 'తను నేను' లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రంతో హీరోగా మారడం సంతోషాన్నిచ్చింది. ప్రేమ, వినోదం, మంచి సంగీతం మేళవించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది''అన్నాడు.

Thanu-Nenu hero about Mahesh tweet

రీసెంట్ గా మహేష్ బాబు త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం తను-నేను కు చెందిన ట్రైలర్ ని షేర్ చేస్తూ, విషెష్ చెప్పారు. అలాగే...ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరో మరెవరో కాదని, తనతో ప్రత్యేక అనుబంధం ఉన్న దర్శకుడు స్వర్గీయ శోభన్(బాబి దర్శకుడు, నాని మాటల రచయిత) కుమారుడు అని తెలియచేసారు. అతని తొలి చిత్రం విడుదలకు సిద్దంగా ఉందని, శుభాకాంక్షలు తెలియచేసారు.

English summary
Thanu Nenu hero Santhosh Shoban happy to Mahesh's tweet about him.
Please Wait while comments are loading...