»   » ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంచలన కామెంట్స్

‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'పెళ్లి చూపులు' మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇటీవల జరిగిన ఐఫా అవార్డ్స్ 2017పై సంచలన కామెంట్స్ చేసారు. ఇలాంటి అవార్డ్ పంక్షన్స్ అనేవి సినిమా టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి కాదని, కేవలం టీవీ చానల్స్ కోసం, డబ్బు సంపాదించడం కోసమే.... అంటూ ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు.

  ఇంకా మనం స్టార్ డమ్ చుట్టూ తిరుగుతున్నాం... నేను మాత్రం అలా చేయను. స్టార్లతో సినిమా చేయను, కొత్త వారితోనే ప్రయోగాలు చేస్తూ వెళతాను అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు.

  దర్శికి అవార్డు రావడం సంతోషమే కానీ

  దర్శికి అవార్డు రావడం సంతోషమే కానీ

  ఐపా అవార్డ్స్ 2017లో ‘పెళ్లి చూపులు' సినిమాలో నటించిన ప్రియదర్శికి అవార్డు రావడం సంతోషంగానే ఉంది. అయితే మా చిత్ర బృందం పడ్డ కష్టానికి తగిన గుర్తింపు వస్తుందని భావించాను కానీ అలా జరుగక పోవడంతో డిసప్పాయింటుకు గురయ్యానని అన్నారు.

  ఈ అవార్డు ఫంక్షన్స్ కేవలం డబ్బు కోసమే

  ఈ అవార్డు ఫంక్షన్స్ కేవలం డబ్బు కోసమే

  ఈ అవార్డు ఫంక్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం సినిమా టాలెంటును ఎంకరేజ్ చేయడం ఏమాత్రం కాదు.... టీవీ ఛానల్స్ కోసం, డబ్బు సంపాదించడమే వీటి ముఖ్య లక్ష్యం అని తరుణ్ భాస్కర్ అభిప్రాయ పడ్డారు.

  మాకు అవార్డులు రాలేదని కాదు

  మాకు అవార్డులు రాలేదని కాదు

  మాకు అవార్డులు రాలేదని ఈ కామెంట్స్ చేయడం లేదు. ‘క్షణం' చిత్రానికి అవార్డుల పంట పండి ఉంటే నా తలను గర్వంగా పైకెత్తి నడుచుకుంటూ వెళ్లే వాడిని, అపుడు ఈ ఫంక్షన్లు నిజమైనవి, గొప్ప సినిమాలకు మాత్రమే పట్టం కడతారని నమ్మే వాడిని, కానీ ఇక్కడ అలా జకుగలేదు అని తరుణ్ భాస్కర్ అభిప్రాయ పడ్డారు.

   ఇంకా వాళ్లను కాకా పడుతూనే ఉన్నాం

  ఇంకా వాళ్లను కాకా పడుతూనే ఉన్నాం

  మనం ఇంకా స్టార్స్ ను కాకా పడుతూనే ఉన్నాం...చిన్న సినిమాలను అభినందించాలంటే భయపడి పోతున్నాం. స్టార్ డమ్ ను కీర్తిస్తూనే ఉన్నాం... అంటూ తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు.

  గుర్తింపు లేని లాభం ఎందుకు?

  గుర్తింపు లేని లాభం ఎందుకు?

  గుర్తింపు లేనపుడు మంచి పనులు చేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు. తెలుగు భాషలో ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకు చేయాలి. ఆ ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి. కానీ గుర్తింపు లేని లాభం ఎందుకు? అంటూ తరుణ్ భాస్కర్ అసహనం వ్యక్తం చేసారు.

  కన్నడ పరిశ్రమ బెస్ట్

  కన్నడ పరిశ్రమ బెస్ట్

  కన్నడ చిత్రాలకు వచ్చిన అవార్డులు చూస్తే సంతోషంగా ఉంది. ఏ సినిమాకైతే గొప్ప కథ, దర్శకత్వం, నటన ఉన్నాయో అవే అవార్డులను అందుకున్నాయి అని తరుణ్ భాస్కర్ అభిప్రాయ పడ్డారు.

  స్టార్లతో సినిమా చేయను

  స్టార్లతో సినిమా చేయను

  నేను ఇపుడు ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చాను. స్టార్ డమ్ ఉపయోగించి ఎట్టి స్థిలోనూ సినిమా చేయను, ఇలానే కొత్త కథలతో ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తాను అంటూ తరుణ్ భాస్కర్ తేల్చి చెప్పారు.

  English summary
  Pelli Choopulu Director Tharun Bhascker Dhaassyam Sensational Comments On IIFA Utsavam Awards 2017. Although, I'm super happy for Darshi I honestly thought we'd be appreciated slightly more for the work we've done as a team but I was disappointed to realise that these shows only exist for TV and are merely only making money. I'm not being a sour loser, I would walked out with my head held high if Kshanam bagged most awards as it would only show that the awards are genuine appreciation for cinematic excellence in Telugu films.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more