»   » బల్లాల దేవుడి రథం రహస్యం : కత్తుల రథాన్ని లాగింది గుర్రాలు కాదు....

బల్లాల దేవుడి రథం రహస్యం : కత్తుల రథాన్ని లాగింది గుర్రాలు కాదు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ఇప్పట్లో ఈ ఫీవర్ తగ్గే లాగ లేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చే ప్రతీ చిన్న వార్తా ఆసక్తి కరంగానే చూస్తున్నారు. ఇప్పుడు మాహిష్మతీ సెట్టింగులూ, వీఎఫ్ఫెక్స్ గ్రాఫిక్ వర్కులూ అయిపోతూంటే బాహుబలి టీమ్ లో పని చేసిన ఒక్కొక్కరూ మరిన్ని కొత్త విషయాలు బయట పెడ్తూ వస్తున్నారు. .

బల్లాల దేవుడి రథం

బల్లాల దేవుడి రథం

ఇప్పుడు తాజాగా ఆర్ట్ డైరెక్టర్ చెప్పిన "బల్లాల దేవుడి రథం" వెనుక రహస్యం ఇంట్రస్టింగ్ గా ఉంది. మళ్ళీ ఒక సారి బాహుబలి లో ఉండే బల్లాల దేవుడు కత్తుల రథాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆనాటి యుద్ద వ్యూహాల్లో ఇలాంటి రథం ఒకటి ఉందో లేదో గానీ, రాజమౌళి కోరుకున్నట్టు ఓ కత్తుల తో ఉండే యుద్ద రథాన్ని మాత్రం తయారు చేసారు ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు.


లాగింది గుర్రాలు కాదు

లాగింది గుర్రాలు కాదు

అయితే ఈ రథాన్ని లాగింది మాత్రం గుర్రాలు కాదు అదంతా వీ‌ఎఫ్‌ఎక్స్ మహిమే. అయితే ఆ రథం అంత వేగంగా మూవ్ అవటానికి కారణం మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజిన్ . మీరు చదివింది నిజమే ఆ రథాన్ని నడిపింది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇంజిన్. పైకి కనిపించే గుర్రాలు గ్రా"ఫిక్స్" లో వచ్చాయి అని చెప్పాడు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్


డ్రైవర్ కూడా కూర్చునేట్లు

డ్రైవర్ కూడా కూర్చునేట్లు

అంతే కాదు.. రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్.. దాని వెనుక ఒక డ్రైవర్ కూడా కూర్చునేట్లు డిజైన్ చేశారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్తో కూడిన రథాన్ని నడిపిస్తుంటా. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్ బృందమే తీర్చిదిద్దిందట. డు అతను కనిపించకుండా ముందు భాగాన్ని కవర్ చేసి గుర్రాలు రథాన్ని లాగినట్టు చూపించారు.


350 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్

350 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంజిన్ ను ఎక్కడైనా సులభంగా బిగించుకునే అవకాశముండటం.. భారీ బరువుల్ని లాగే సామర్థ్యం దానికి ఉండటంతో సాబు బృందం రథం కోసం ఉపయోగించుకుంది. రథం కోసం 350 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ వాడారట. ఇన్ని రకాల ఆలోచనలూ, ఇంత కష్టమూ పడ్డారు గనకే ఇవాళ బాహుబలి అంతటి విజయాన్ని సాధించింది.English summary
“Bhallala Deva’s chariot was built around a Royal Enfield engine so that it would get the power and speed it required. We had done the same in the first part as well
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu