»   » కేన్స్ లో అందాలు ఆరబోసారు -అంతర్జాతీయ సినీ ఉత్సవం లో అందాల తారలు

కేన్స్ లో అందాలు ఆరబోసారు -అంతర్జాతీయ సినీ ఉత్సవం లో అందాల తారలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

69వ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బుధవారం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సినీ తారల రంగురంగుల డ్రెస్సులతో, జిగేల్‌మనిపించే విద్యుత్‌ కాంతుల వెలుగులతో కేన్స్‌ నగరం మొత్తం కలర్‌ఫుల్‌గా మారింది. రెడ్‌ కార్పెట్‌పై అందాల తారల హొయలు, వారి అందాలను బంధించేందుకు కెమెరా ఫ్లాష్‌లు పోటీపడగా చూపరులు సైతం మంత్రముగ్దులయ్యారు.

-బ్లేక్‌ లైవ్లీ, క్రిస్టెన్‌ స్టీవర్ట్‌, ఎల్లే ఫెన్నింగ్‌, లిలీ రోజ్‌ డెప్‌, జులియానె, నవొమి వాట్స్‌, జెస్సికా క్రిస్టియానా, అరెయా ఏ. హర్గేట్‌, ఈవా లాంగోరియా, విక్టోరియా బెకహేమ్‌, డౌజెన్‌ క్రోస్‌, బెల్లా దిద్‌, లిల్లీ డోనాల్డ్‌, క్రిస్టెన్‌ డస్ట్‌, అన్నా కెండ్రిక్‌, మెలిస్సా జార్జ్‌ వంటి హాలీవుడ్‌ అందాల తారలు డిఫరెంట్‌ ప్యాషన్‌ డ్రస్‌లతో రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌వాక్‌ చేస్తూ ఆద్యంతం హల్‌చల్‌ చేశారు..

ఓపెనింగ్‌ నైట్‌లో 'కేఫ్‌ సొసైటీ', 'మనీ మాంస్టర్‌' చిత్రాల్ని ప్రదర్శించారు. వయోబేధం ఉన్న ఓ వ్యక్తికి , ఓ అమ్మాయికి మధ్య ప్రేమ, ఒకే వయస్సున్న జంట మధ్య అనుబంధం ఎలా సాగిందన్న నేపథ్యంలో రూపొందించిన చిత్రం 'కేఫ్‌ సొసైటీ'. వుడీ అలెన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెన్నీని బెర్లిన్‌, స్టీవ్‌ కారెల్‌, జెస్సీ ఇసన్బెర్గ్‌, బ్లేక్‌ లైల్లీ, పార్కెల్‌ పోసే, క్రిస్టెన్‌ స్టీవర్ట్‌, కోరీ స్టోల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మంచి ప్రశంసలందుకుంది. దీంతోపాటు 'ద నియోన్‌ డిమాన్‌', 'పర్సనల్‌ షాపర్‌', 'ద డాన్సర్‌' వంటి చిత్రాలను ప్రదర్శించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా దాదాపు రెండు గంటలపాటు చలన చిత్రోత్సవ లక్ష్యాలు, సినిమాల తీరుతెన్నుల గురించి జ్యూరీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

69వ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బుధవారం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సినీ తారల రంగురంగుల డ్రెస్సులతో, జిగేల్‌మనిపించే విద్యుత్‌ కాంతుల వెలుగులతో కేన్స్‌ నగరం మొత్తం కలర్‌ఫుల్‌గా మారింది.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

మనీ మాస్టర్ ప్రిమియర్ షో కి హాజరైన ఈ హాలీవుడ్ తెల్ల సుందరి జూలియా రాబర్ట్స్ నల్ల గౌను లో ఎర్ర కార్పెట్ లో మెరిసిపోయింది.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

మనీ మాస్టర్ కోసమే వచ్చిన ఇంకో హాలీవుడ్ సుందరి సుసాన్

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

కేఫ్ సొసైటీ ప్రీమియర్ లో జూలియన్ మూర్ ఇలా కేక పెట్టించింది. రెండు నాగు పాముల పడగలని పైకి కనిపించేలా డిజన్ చేసిన డ్రెస్ తో అందర్నీ మంత్రముగ్దులని చేసిందీ నాగకన్య.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

కేఫ్ సొసైటీ మూవీ చూసారో లేదో గానీ... బార్బరా మేయర్ ని మాత్రం కళ్ళప్పగించి చూసారంతా..

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

చొక్కాలకి జేబులెందుకుంటాయో తెలుసా క్రిస్టీన్ కి బాగా నే తెలుసు... "అందుకే జేబులతో దాచుకుంది"

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

మల్లికని చూసి కళ్ళుతిరిగిపోయాయ్ అందరికీ కేఫ్ సొసైటీ కే వచ్చిన మల్లిక మెర్మైడ్ డ్రెస్ తో మెస్మరైజ్ చేసింది. లేత గోధమ రంగుతో పొడవాటి నెమలి అంచు గౌన్‌, ధగ ధగలాడే డైమండ్‌ నెక్లెస్‌ ధరించి దేవకన్య లా మెరిసి పోయింది మల్లిక.మల్లిక నటించిన చిత్రం 'ద టైమ్‌ రైడర్స్‌' ఈ వేడుకల్లో ప్రదర్శితం కానుంది.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

అలాగే ఈ కేన్స్‌ వేడుకల్లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరారు 15వ సారి సందడి చేయనుంది. ఈ నెల 15, 16 తేదీల్లో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య సందడి చేయనుంది.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

సోనమ్‌ కపూర్‌ 13,14 తేదీల్లో రెడ్‌ కార్పెట్‌పై హల్‌చల్‌ చేయనుంది.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

తొలిసారి అమీజాక్సన్‌ ఈ ఫెస్టివల్‌లో పాల్గొనబోతోంది. రెడ్‌కార్పెట్‌పై హొయలు పోవడానికి దాదాపు 25 రకాల డ్రెస్స్‌లు ఎంపిక చేసుకుని వాటితో కసరత్తులు చేస్తుందట అమీ. అంతేకాదు ఈ వేడుకల్లో తన బాలీవుడ్‌ జర్నీ గురించి, సిరియా శరణార్థులను రక్షించడం కోసం ఫండ్‌ రైజింగ్‌ వంటి తదితర అంశాల గురించి కూడా చర్చించనుంది.

కేన్స్ ఫెస్టివల్

కేన్స్ ఫెస్టివల్

తాజాగా కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫిల్మ్‌ మార్కెంటింగ్‌కు సంబంధించిన అంశంలో "బాహుబలి" పాలుపంచుకోబోతోంది.మే 11 నుంచి 22 వర‌కూ జ‌రిగే ఫెస్టివ‌ల్ లో 16వ తేదిన సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఓ తెలుగు సినిమా విదేశీ భాష‌ల సినిమాల‌తో పోటీ ప‌డటం తొలిసారి.

English summary
All the news of the Festival de Cannes photos
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu