‘26/11 దాడులు’ వ్యక్తిగా నన్ను మార్చాయి : వర్మ
ముంబై : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబై దాడుల సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'ద అటాక్స్ ఆఫ్ 26/11' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో '26/11 దాడులు' పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా వర్మ ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు.
ముంబై నగంపై ముష్కర మూకల దాడుల నేపథ్యంలోనే ఈచిత్రాన్ని రూపొందిస్తున్నాను అని చెబుతున్న వర్మ...ఒక వ్యక్తిగా నాలో ఎంతో మార్పు తెచ్చింది. చివరి షెడ్యూల్ లో సిఎస్‌టి(చత్రపతి శివాజీ టెర్మినస్) స్టేషన్లో జరిగిన దాడులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించామని వర్మ వెల్లడించారు.
కసబ్ మరియు అతన్ని ఫాలో అవుతూ వచ్చిన ఇస్మాయిల్ సిఎస్‌టి స్టేషన్లో 65 మందిని చంపేయడంతో పాటు వందల మందిని గాయపరిచారని, ఈ సన్నివేశాలను చిత్రీకరించామని వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించబోతున్నానని వర్మ స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications












