»   » ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక సాక్షిగా మోసం చేసారంటూ...!

‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక సాక్షిగా మోసం చేసారంటూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యాేజ్' ఆడియో రిలీజ్ ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక అంతా బాగానే జరిగినా, ఈ వేడుకలో స్టేజీపై పాటలు పాడిన ఇద్దరు సింగర్ల విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.

ఆడియో రిలీజ్ సందర్భంగా సింగర్ నేహా బాసిన్, శ్రావణ భార్గవి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే వీరు నిజంగా స్టేజిపై పాట పాడలేదని, లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు యాక్ట్ చేసారని, ముందే రికార్డ్ అయిన పాటలు బ్రాగ్కౌండ్ లో ప్లే అవుతుంటే... వీరు లైవ్ లో పాడినట్లు పెదవులు ఆడిస్తూ నటించారంటూ..., వారితో రియల్ గా పాడించకుండా ఇలా నటింప చేసిన నిర్వాహకులపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.


The audience feeling cheated at Janatha Garage Audio?

నిర్వాహకులు కావాలనే ఇలా సెట్ చేసారని, ఆఫ్ చేసి ఉన్న మైకులో నేహా బాసిన్ స్టేజీ పై పెదవులు ఆడిస్తూ.....పాడినట్లు నటించిందని, మైక్ ఆఫ్ చేసి ఉన్న సంగతి మచిరిపోయి చివర్లో మాట్లాడానికి ప్రయత్నించింది....ఆమె మాట్లాడిన మాటలు సౌండ్ సిస్టంలో రాలేదు. తర్వాత మైక్ ఆన్ చేసి మాట్లాడింది. దీంతో అందరికీ విషయం అర్థం అయిపోయింది.


ఇక శ్రావణ భార్గవి పాట పాడుతుంటే..... వాయిస్ మొత్తం గీతా మాధురి పాడినట్లే అనిపించింది. నిజానికి సినిమాలో ఒరిజినల్ పాట పాడింది కూడా గీతా మాధురే. ఆడియో రిలీజ్ సమయంలో ఆమె అందుబాటులో లేక పోవడంతో శ్రావణ భార్గవిని పిలిపించారు. ఎందుకంటే ఆక్కడ పాడేది ఏమీ లేదు.. కేవలం యాక్ట్ చేయడమే కాబట్టి. కానీ ఎవరి గొంతు ఏదో గుర్తు పట్టలేనంత వెర్రివాళ్లా? ప్రేక్షకులేమైనా?


ఏది ఏమైనా.....ఇలాంటి గిమ్మిక్స్ వల్ల పరువు పోవడమే తప్ప వచ్చేదేమీ లేదు. నిజాయితీగా ఏ పని చేసినా ప్రేక్షకులు ఆమోదిస్తారు. ఇలాంటి చర్యల వల్ల నిర్వాహకుల చేతిలో తాము మోస పోయామనే ఫీలింక్ కలగుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

English summary
The audience feeling cheated at The audio release event of NTR's 'Janatha Garage' which was held the other day has proved this appalling fact.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu