»   » అంతా గ్యాసే: ప్రభాస్ చేతుల్లో పిల్లాడు "చిన్న బాహుబలి" కాదు

అంతా గ్యాసే: ప్రభాస్ చేతుల్లో పిల్లాడు "చిన్న బాహుబలి" కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య ఒక చిన్న బాబుని ఎత్తుకున్న ప్రభాస్ ఫొటో నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఆ పిల్లవాడే బాహుబలి లో "చిన్న బాహుబలి" (మహేంద్ర బాహుబలి) గా కనిపించాడంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ పిల్ల వాన్నే మొదటి భాగం లో శివగామి పాత్ర చేసిన రమ్యకృష్ణ ఎత్తుకుంటుంది. అయితే ఆ బిడ్డ ఇప్పుడు నెట్ లో కనిపిస్తున్న ప్రభాస్ చేతిలో ఉన్న పాప ఒకరు కాదట.

చిన్నారి మహేంద్ర బాహుబలి

చిన్నారి మహేంద్ర బాహుబలి

బాహుబలి ది బిగినింగ్ లో రమ్యకృష్ణ చేతిలో ఉన్న బిడ్డను.. ఇప్పుడు ఎంతో ప్రేమగా ప్రభాస్ ఎత్తుకున్నాడని అంటూ ఒక ఫొటో కనిపిస్తోంది అంటే.. చిన్నారి మహేంద్ర బాహుబలి గా కనిపించిన బిడ్డనే ప్రభాస్ ఎత్తుకున్నాడంటూ చెప్పి ఆ ఫొటోని నెట్లోకి వదిలారు. అయితే.. నిజానికి రమ్యకృష్ణ ఎత్తుకున్న బిడ్డ.. నిజానికి ఓ బొమ్మ మాత్రమే.

18 రోజుల పాప

18 రోజుల పాప

అప్పుడు పిల్లవాడు నిజంగా ఆమె చేతిలో లేడు ఆ బొమ్మనే గ్రాఫిక్స్ లో నిజమైన బిడ్డగ్గా చూపించారు. కానీ క్లోజప్ షాట్స్ లో మాత్రం ఓ 18 రోజుల పాప (ఆడపిల్ల)పై చిత్రీకరించారు. ఆపాపకూడా బాహుబలి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కుమార్తె అక్షిత. కేరళ షెడ్యూల్ లో ఉండగా ఆ పాపతో ఈ షాట్ ను చిత్రీకరించారంతే.

లిటిల్ బాహుబలి

లిటిల్ బాహుబలి

అయితే.. ఆ పాపనే ప్రభాస్ ఎత్తుకుని ఫొటో దిగాడంటూ అమరేంద్ర బాహుబలి విత్ లిటిల్ మహేంద్ర బాహుబలి అంటూ పోస్ట్ చేయటం మొదలు పెట్టారు. అసలు విషయం తెలియని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ బిడ్డనే బాహుబలిలో కనిపించిన లిటిల్ బాహుబలి అనుకున్నారు కానీ.. నిజానికి ప్రభాస్ ఎత్తుకున్న బిడ్డ ఆ చిన్నారి కాదు..

ఇంటర్నెట్ కు చేరేసరికి

ఇంటర్నెట్ కు చేరేసరికి

రీసెంట్ గా ప్రభాస్ ను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్ లో ఒకరి చిన్నారిని ఎత్తుకుని ఫోటోలకు పోజిచ్చాడు బాహుబలి. ఆ ఫోటోనే ఇంటర్నెట్ కు చేరేసరికి. ఇలా రకరకాల రూపాలు మారి. చివరకు జూనియర్ బాహుబలి అంటూ ప్రచారమైంది. నిజానికి ఇప్పుడు అక్షిత వయస్సు 4 సంవత్సరాలు. ప్రభాస్ చేతిలో ఉన్నది సంవత్సరం కూడా నిండని చిన్నారి. పోనీ అప్పటి ఫొటోనే అనుకుందామా అంటే ప్రభాస్ లుక్ చూస్తేనే అది బాహుబలి పార్ట్ 2 ల నాటి లుక్ తో లేటెస్ట్ ఫొటో అని తెలిసి పోతోంది.

English summary
Since Two days a photo Bahubali prabhas with a little girl is gone viral by sayng that was the girl who played as mahendra bahubali, But now it comes to know that is a fack news
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu