twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ అశ్లీలంపై రాష్ట్రపతి విమర్శ (వందేళ్ల వేడుక ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ తరం సినిమాల్లో అశ్లీల, అసభ్యత, హింసాత్మక అంశాలు ఎక్కువవడంపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి అంశాలకు ప్రధాన్యత తగ్గించి సమాజానికి ఉపయోగ పడేలా సినిమాలు తీయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో అత్యాచారాలు, కుల ఘర్షణలు నిర్మూలించేలా సినిమాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా చెన్నైలో జరుగుతున్న వందేళ్ల భారతీయ సినిమా వేడుక ముగింపు కార్యక్రమలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, సమాజిక బాధ్యత కూడా అని ఆయన గుర్తు చేసారు. సినిమా ఒక బలమైన సాధనమని, ఇటువంటి బలమైన ఆయుధాన్ని సమాజ ఉద్దరణకు వాడాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలోని దురాచారాలను నిర్మూలించాల్సిన సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

    భావితరాలకు మన సినిమాల ఘనత గుర్తుండాలంటే 1940-1970 లమధ్య కాలంలో వచ్చిన కొన్ని గొప్పచిత్రాల్లాంటివి మళ్లీ రావాలన్నారు. 100 ఏళ్లలో భారతీయ చలన చిత్ర రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలోనే అత్యంత భారీ పరిశ్రమగా మారిందని ప్రణబ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ మంది ఈ పరిశ్రమలోనే పని చేస్తున్నారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

    ఈ సందర్భంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య శతవసంతాల భారతీయ చన చిత్ర విశేషాలను తెలిపే సావనీర్ కాపీని ఆవిష్కరించి తొలి కాపీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ...ప్రస్తుతం వస్తున్న సినిమాలను ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయని, సారం ఉండే మంచి సినిమాలు తీయాల్సిన ఆశ్యకత ఎంతైనా ఉందన్నారు.

    ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకు జీవిత కాల పురస్కారాలు అందజేసారు. అంజలి దేవి, కె విశ్వనాథ్, ఎంఎస్ విశ్వనాథన్, వైజయంతిమాల, ఎవియం శరవణన్, బాపు, కె.రాఘవేంద్రరావు, పార్వతమ్మ రాజ్ కుమార్, అమితాబ్ బచ్చన్; మమ్ముట్టి, మోహన్ లాల్, శ్రీదేవి, రేఖ, భారతి విష్ణు వర్ధన్, అంబరీష్, రాజేంద్రసింగ్, బిఎస్ ద్వారకేష్, రవిచంద్రన్, వీరన్న, మాధవన్ నాయర్, ఆదూర్ గోపాలకృష్ణ, చంద్రన్, కుంచరో గోపన్న, కిరణ్, రణదీర్ రాజ్ కపూర్, రమేస్ సిప్పీ, కమల బందాజ్వ, వినయ్ కుమార్ చుంబే, జావేద్ అక్తర్, తదితరులతో పాటు తెలుగు, తమిళ, కేరళ, కర్నాటక, మరాఠి, భోజ్ పురి, బెంగాలీ భాషలకు చెందిన వారు రాష్ట్రపతి చేతుల మీదుగా మెమొంటోలు అందుకున్నారు.

    రాష్ట్రపతి

    రాష్ట్రపతి

    తమిళనాడు గవర్నర్ రోశయ్య శతవసంతాల భారతీయ చన చిత్ర విశేషాలను తెలిపే సావనీర్ కాపీని ఆవిష్కరించి తొలి కాపీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసారు.

    రాఘవేంద్రరావు

    రాఘవేంద్రరావు

    చెన్నైలో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా మెమొంటో అందుకున్న తెలుగు గర్శకుడు రాఘవేంద్రరావు

    మమ్ముట్టి

    మమ్ముట్టి

    వందేళ్ల సినిమా వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదు గా మెమొంటో అందుకున్న మళయాల నటుడు మమ్ముట్టి

    మోహన్ లాల్

    మోహన్ లాల్

    మళయాల నటుడు మోహన్ లాల్ వందేళ్ల సినిమా వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా మెమొంటో అందుకున్నారు.

    అమితాబ్ బచ్చన్

    అమితాబ్ బచ్చన్

    బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చెన్నైలో సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో జరిగిన వందేళ్ల సినిమా వేడుకలో పాల్గొన్నారు.

    రేఖ

    రేఖ

    బాలీవుడ్ సీనియర్ నటి రేఖ వందేళ్ల సినిమా వేడుకలో పాల్గొన్నారు. రాష్ట్రపతిచేతుల మీదుగా మెమొంటో అందుకున్నారు.

    స్టార్స్

    స్టార్స్

    వందేళ్ల సినిమా పండగలో ప్రముఖ సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, అజిత్ కుమార్, కార్తి తదితరులు పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    రజనీకాంత్

    రజనీకాంత్

    ప్రముఖ సౌతిండియా స్టార్ హీరో రజనీకాంత్ సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన వందేళ్ల సినీ వేడుకలో పాల్గొన్నారు.

    శ్రీదేవి

    శ్రీదేవి

    ప్రముఖ నటి శ్రీదేవి చెన్నైలో జరిగిన వందేళ్ల సినీ వేడుకలో పాల్గొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా మెమొంటో అందుకున్నారు.

    వెంకటేష్

    వెంకటేష్

    ప్రముఖ తెలుగు సినీ నటుడు వెంకటేష్ చెన్నైలో జరిగిన వందేళ్ల సినిమా వేడుకకు హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    English summary
    The celebration of 100 years of cinema closing ceremony yesterday in a grand way at Chennai last night. The celebrations that had been going on since four days in Nehru Stadium, Chennai came to the concluding day which was attended by the President of India Pranab Mukherjee as chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X