దిల్ రాజు 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్
రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం మే 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో రామ్ మాట్లాడుతూ- "రాముడంటే జన్యూన్ గా ఉంటాడు. కృష్ణుడేమో మాయ చేస్తాడు. ఈ ఇద్దరు దేవుళ్ల క్యారెక్టరైజేషన్స్ నా పాత్రలో ఉంటాయి. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. టైటిల్ కూడా అందరికీ నచ్చింది. ఈ సమ్మర్ లో మంచి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలుస్తుంది' అని అన్నారు. ఇక లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, బిందు మాధవి హీరోయిన్స్ గా చేసారు. సీనియర్ హీరో అర్జున్ అశోక్ దేవగా ఇందులోకీ రోల్ చేశారు. రామ్, అర్జున్ ల మధ్య ఉండే సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.
రామ్ రామ రామ కృష్ణ కృష్ణ దిల్ రాజు ప్రియా ఆనంద్ బిందు మాధవి ram rama rama krishna krishna dil raju priya anand bindu madhavi


Click it and Unblock the Notifications