»   » నిత్యా మీనన్ 'జతగా...' ఫస్ట్ లుక్ పోస్టర్

నిత్యా మీనన్ 'జతగా...' ఫస్ట్ లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నిత్యా మేనన్‌, దుల్కర్‌ సల్మాన్‌ జంటగా సురేష్‌ కొండేటి నిర్మిస్తున్న చిత్రం 'జతగా...'. ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ విడుదలయ్యాయి. నిత్యా మేనన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 'ఓకే బంగారం' చిత్రంలో తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన నిత్యా, దుల్కర్‌లు మరోసారి ఈ చిత్రం ద్వారా అలరించనున్నారు. అన్వర్‌ రషీద్‌ దర్శకత్వం ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

The first look official logo of dulQuer ,NithyaMenen's 'Jathaga ! '

'ఒకే బంగారం' ఫేమ్‌ మలయాళం నటుడు ముమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మీనన్‌. వీరు జంటగా నటించిన మలయాళ చిత్రం ' ఉస్తాద్‌ హోటల్‌'. మలయాళంలో ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'జతగా...' పేరుతో విడుదల చేయబోతున్నారు. 'ప్రేమిస్తే' 'షాపింగ్‌ మాల్‌' 'జర్నీ' వంటి చిత్రాలకు నిర్మాతగా పనిచేసిన సురేష్‌ కొండేటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

అన్వర్‌ రషీద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఉస్తాద్‌ హోటల్‌' చిత్రంలో దుక్కర్‌, నిత్యా మీనన్‌ జోడీ బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదురింది. వీరిద్దరూ 'ఓకే బంగారం' లో చేసిన మ్యాజిక్‌ తెలిసిందే.

The first look official logo of dulQuer ,NithyaMenen's 'Jathaga ! '

ఇప్పుడు ' జతగా' సినిమాలో కూడా వీరి నటన చాలా బాగుంది. ఈ చిత్రానికి సాహితి రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్‌ స్వరపరచిన గీతాలు అద్భుతంగా ఉన్నాయి. ఇదొక మ్యూజిక్‌ సినిమా. దీనిని త్వరలో విడుదల చేయబోతున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : గోపీ సుందరం

English summary
The first look official logo of dulQuer ,NithyaMenen's 'Jathaga ! ' released today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu