twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎన్టీఆర్'.. ఆ వైబ్రేషన్‌కు తగ్గట్లే ఫస్ట్ లుక్: బయోపిక్ పోస్టర్ అదిరిపోయింది..

    |

    'ఎన్టీఆర్'.. ఈ పేరు వింటేనే చాలామందికి ఏదో తెలియని వైబ్రేషన్. తెలుగునాట సినిమాల్ని, రాజకీయాల్ని ఎన్టీఆర్ తరహాలో ప్రభావితం చేసిన మరో వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే.. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే తెలుగు ప్రజలందరి చూపు అటువైపే. ఆ అంచనాలను అందుకోవడానికి దర్శకుడు తేజ బాగానే కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

     ఫస్ట్ లుక్:

    ఫస్ట్ లుక్:

    నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా చిత్ర యూనిట్ ఈ బయోపిక్‌కి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో.. అశేష జనసందోహం మధ్య ఎన్టీఆర్ ప్రసంగిస్తున్న చిత్రాన్ని ఫస్ట్ లుక్‌గా విడుదల చేసింది.

    ఆ స్టేట్‌మెంట్‌తో..:

    ఆ స్టేట్‌మెంట్‌తో..:

    ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ మహానుభావునికి ఇదే మా నివాళి అని చిత్ర యూనిట్ ప్రకటించింది. బ్లాక్&వైట్ లో ఉన్న ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    Recommended Video

    చంద్రబాబు క్యారెక్టర్ లో ఈ హీరో నా ?
     ఎన్టీఆర్ 'చైతన్యరథం':

    ఎన్టీఆర్ 'చైతన్యరథం':

    అప్పట్లో ఎన్టీఆర్ తన పర్యటనల కోసం 'చైతన్య రథం' ఉపయోగించారు. 1983లో ఎన్టీఆర్ తొలిసారి చైతన్య రథం పైనే జనంలోకి వెళ్లారు. ఖాకీ ప్యాంట్, ఖాకీ చొక్కాలో ఆయన ఆహార్యం చాలామందిని కట్టిపడేసింది. ఆ రథంపై నిలబడి.. 'తెలుగింటి ఆడపడుచుల్లారా..' అంటూ ఆయన ప్రసంగిస్తుంటే జనం పులకించిపోయారు.

     టీజర్ అన్నారు..కానీ?:

    టీజర్ అన్నారు..కానీ?:

    ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అంతటి ప్రాధాన్యం ఉన్న చైతన్యరథాన్ని సినిమాలోనూ హైలైట్ అయ్యేలా చూపించబోతున్నారని సమాచారం. నిజానికి ఎన్టీఆర్ వర్దంతి రోజు 'టీజర్' విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. ఎందుకనో ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టడం గమనార్హం.

     తేజ ఎలా తీస్తాడో..:

    తేజ ఎలా తీస్తాడో..:

    ఎన్టీఆర్ తన జీవితంలో ఎంత వెలుగు వెలిగారో.. ఒకానొక స్థాయిలో అంతటి క్షోభ అనుభవించారన్నది కఠిన వాస్తవం. ఈ నేపథ్యంలో ఆయన బయోపిక్ ను వివాదాస్పద అంశాలకు దూరంగా నడిపిస్తారా?.. లేక అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వివాదాలను కూడా తడుముతారా అన్నది వేచిచూడాల్సిందే.

    టెక్నికల్ డిటెయిల్స్:

    టెక్నికల్ డిటెయిల్స్:

    ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణ, సాయి కొర్రపాటిలు నిర్మిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి కెమెరామెన్ కాగా, ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చిలో మొదలుకానుంది. సినిమాలో కల్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో కనిపించబోతుండటం విశేషం.

    English summary
    From a long time, if there is any project that is teasing Telugu audiences, it is nothing but the film that happens to be the biopic of most popular Telugu legend Nandamuri Taraka Ramarao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X