»   » వరుణ్ తేజ్...‘కంచె’ ఫస్ట్ టీజర్ సిద్ధమైంది

వరుణ్ తేజ్...‘కంచె’ ఫస్ట్ టీజర్ సిద్ధమైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘కంచె' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. గత నెలలో విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ సిద్ధమైంది. ఆగస్టు 15 సందర్భంగా ఈ టీజర్ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తన అపీషియల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా వెల్లడించారు.


మెగా ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘కంచె' రషెస్ చూసిన నాగబాబు షాకయ్యారని, తాను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. స్టన్నింగ్ విజువల్ష్, గ్రాండ్ గా తెరకెక్కించిన సన్నివేశాలు, వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ తో ‘కంచె' మూవీ అదిరిపోయే రేంజిలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో వరుణ్ తేజ్ సైనికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటించింది. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


The first teaser of kanche will be out this August 15th

మరో వైపు పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "లోఫర్" అనే టైటిల్ ని పూరి ఫిక్స్ చేసారు. ఇటీవల ఈ సినిమా లాంచనంగా ప్రారంభం అయింది. తొలి సినిమా ‘ముకుంద'తో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది.


English summary
"The first teaser of #kanche will be out this August 15th...Stay tuned!" Varun Tej tweeted.
Please Wait while comments are loading...