»   »  అర్థం లేని భయాలా?? నిజాలా..? చిరు-బాలయ్యా ఎవరు గెలుస్తారు??

అర్థం లేని భయాలా?? నిజాలా..? చిరు-బాలయ్యా ఎవరు గెలుస్తారు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సంక్రాంతి కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందేమో తెలుగువాళ్ళకి ఎందుకంటే అందరు అగ్రహీరోలూ దాదాపు గా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. చిరు, బాల కృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగారునా... ఇలా డిసెంబర్నుంచి మొదలై మార్చి వరకూ వరుసపెట్టి అగ్రహీరోల సినిమాలు రానున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అటు ఖైదీనెం.150 ఇటు గౌతమీ పుత్ర శాతకర్ణి లమీదే అందరి దృష్టీ నిలిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ రెండుసినిమాలకీ దేనిప్రత్యేకత దానికేఉంది. దాదాపు దశాబ్దం దగ్గరలో గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్ళీ వస్తున్న సినిమా ఖైదీ కాగా, బాలయ్య తన శతసినిమాల టాగెట్ ని చేరుకున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి, తెలుగు సినిమా చరిత్రలో ఈ రెండు సినిమాలూ అత్యధిక ప్రధాన్యతను సంతరించుకున్నవే. అయితే ఈ రెండు మైలు రాళ్ళలో ఏ సినిమా నిలబడుతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.

ఈసారి కేవలం అభిమానుల కు మాత్రమే కాదు ప్రతీ తెలుగు సినిమా ప్రేక్షకుని చూపూ ఈ రెండుసినిమాలవైపే అయితే ఇప్పుడు గెలుపు అవకాశాలే కాదు ప్రతీ విషయం లోనూ అతి జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి ఈ రెండు సినిమా యూనిట్లు కూడా. ఏ ఒక్క అంశాన్నీ తేలిగ్గా తీసుకోవటం లేదు. ఎవరికి వారు తమదే పై చేయి అనిపించుకోవాలన్నంత తపనతోఉన్నారు. ఇప్పుడు కొన్ని పాయింట్లు మరీ ఎక్కువగా కాదుగానీ ఒకింత ఆందోలన గానే ఉన్నాయి. విజయం మీద ఏ అనుఇమానమూ లేదు ఖచ్చితంగా ఈ రెండు సినిమాలూ విజయం సాధించే తీరుతాయి కానీ ఏ విశయం లో ఎవరు పై చేయిగా నిలబడతారన్నదే ఇక్కడ ప్రధానాంశం... అలా ఇప్పుడు అభిమానులని కలవర పెడుతున్న కొన్ని విషయాలు ఇవి...

 బాలయ్య పద్యాలే మైనస్సా:

బాలయ్య పద్యాలే మైనస్సా:


గౌతమీపుత్ర శాతకర్ణి లో పద్యాలు పాడబోతున్నాడట బాలయ్య.. మీరు విన్నది నిజమే ఈకాలం లో పద్యాలేమిటి అనిపించినా తెలుస్తున్న సమాచారం మేరకు ‘శాతకర్ణి' సినిమాలో భారీ డైలాగులు యుద్ధాలు మాత్రమే కాదు ఈసినిమాలో మన తెలుగు సాంప్రదాయాలను ప్రతిబింబించే బుర్రకథ పద్యాలు శ్లోకాలు కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 జానపద గాథ:

జానపద గాథ:


అయితే ఎంత అభిమానం ఉన్నా ఒక పురాణ గాథ, లేదా ఒక జానపద గాథని చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చిన పద్యాలనీ, శ్లోకాలనీ ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కి తర్వాతి సీన్ లోకి వెళ్ళిపోయే ఇప్పటి కాలం లో యువత ఈ పధ్యాలని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు యూనిట్ ని వేదిస్తున్న అనుమానం.

 బుర్రకథ:

బుర్రకథ:


అయితే దర్శకుడు క్రిష్ మాత్రం ఈ విషయం లో కాంఫిడెంట్ గానే ఉన్నాడు. బుర్రకథలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించిన ఒక కీలక సన్నివేశంలో ఈ బుర్రకథ వస్తుందని వార్తలు వస్తున్నాయి. బుర్రకథే కీలకాంశం అయినప్పుడు తప్పదు కానీ మరీ ఎక్కువ నిడివి ఈ పద్యాలదే అయితే మాత్రం ఖచ్చితంగా బోర్ ఫీలవుతాడు ప్రేక్షకుడు.

 తెలుగు భాషా సంస్కృతి:

తెలుగు భాషా సంస్కృతి:


అంతేకాదు బాలకృష్ణకు పద్యాలు శ్లోకాలు అంటే బాగా ఇష్టం అయిన నేపధ్యంలో ‘శాతకర్ణి సినిమాలో అందరికీ అర్ధం అయ్యే విధంగా కొన్ని పద్యాలను కూడ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈపధ్యాలు ఈసినిమాలో అక్కడక్కడ వస్తాయట. ఈ పద్యాలు విన్నవారికి తెలుగు భాషా సంస్కృతి గొప్పతనం పై నేటితరం ప్రేక్షకులకు అభిరుచి ఏర్పడుతుంది అని క్రిష్ భావిస్తున్నట్లు టాక్.

 వర్కౌట్ అవుతుందా:

వర్కౌట్ అవుతుందా:


ఇది ఇలా ఉండగా శాతకర్ణి హయాం నుండి తెలుగువారి అందరికీ ఉగాది పండుగ ప్రారంభం అయింది కాబట్టి ఉగాది విశిష్టతను తెలియచేస్తూ బాలయ్య ఈసినిమాలో కొన్ని డైలాగ్స్ అదేవిధంగా కొన్ని పద్యాలు పాడుతాడని తెలుస్తోంది. కానీ బాలయ్య పాడినా ఇంకెవరు పాడినా ఇప్పుడున్న తరం లో పధ్యాలు పాడించటం అన్న ఆలోచన వర్కౌట్ అవుతుందా అన్నది ఇక్కడ పాయింటు .

 బాలయ్య అభిమానులు:

బాలయ్య అభిమానులు:


ఈ వార్తలు ఇలా బయటకు వస్తూ ఉండటంతో క్రిష్ బాలకృష్ణ శాతకర్ణిలో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాడు ఏమిటి అని బాలయ్య అభిమానులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదొక్కటే కాదు బాలయ్య చేసిన యుద్దం సీన్లు కూడా అంత గొప్పగా గ్రాఫిక్ వర్క్ లేకుండా వస్తున్నాయన్న రూమర్ బయల్దేరటం కూడా కాస్త ఇబ్బంది గా పరిణమించింది.

వ్యక్తిగత ప్రతిష్ట:

వ్యక్తిగత ప్రతిష్ట:


రాబోతున్న సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణల వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన రేస్ గా మారిపోవడంతో మెగా నందమూరి వార్ కు సంబంధించి రోజుకు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చే వార్తలు బయట పడుతున్నాయి.. ఇక ఇప్పుడు చిరు విషయానికి వస్తే ఓపెనింగ్స్ ఎక్కువ గౌతమీ పుత్రుడే కొట్టేస్తాడేమో అన్న అనుమానం మొదలయ్యింది.ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం..

 అంగీకరించి తీరాల్సిందే:

అంగీకరించి తీరాల్సిందే:


బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు ఈ సినిమా విడుదలకు కొద్దిరోజులు ముందుగానో లేదంటే ఈ సినిమా విడుదలైన వెంటనే ఈసినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చే ఆస్కారం ఉంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.నిజానికి ఈ వార్తల్లో 90% అంగీకరించి తీరాల్సిందే.

 తెలుగు ప్రజల చక్రవర్తి:

తెలుగు ప్రజల చక్రవర్తి:


ఇప్పటికే ఈ ప్రయత్నాలకు సంబంధించి పనులను ‘శాతకర్ణి' యూనిట్ ప్రారంభించినట్లు టాక్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి' తెలుగు ప్రజల చక్రవర్తి కాబట్టి అదీ కాకుండా ఆయన ఆరోజులలో పరిపాలించిన అమరావతి నేటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ఈ మినహాయింపు ఇవ్వడం ఏ మాత్రం కష్ట సాధ్యమైన పనికాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 రంగం సిద్ధం:

రంగం సిద్ధం:


ఈ ఎత్తుగడలకు అనుగుణంగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత ఈసినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అదేవిధంగా ఆయన మంత్రివర్గ సహచర్లకు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్క్రీనింగ్ తరువాత ఈసినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వవలసిందిగా క్రిష్ చేత అభ్యర్ధన చేయించడానికి రంగం సిద్ధం అయినట్లు టాక్.

 నెట్ కలక్షన్స్ రికార్డు:

నెట్ కలక్షన్స్ రికార్డు:


అయితే ఈ వార్తలే నిజం అయితే కలక్షన్స్ రికార్డులకు సంబంధించి ఈ రెండు సినిమాలకు వచ్చిన నెట్ కలక్షన్స్ రికార్డులలో ‘ఖైదీ నెంబర్ 150' కంటే నెట్ కలక్షన్స్ రికార్డుల విషయంలో బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైన మొదటి రోజు నుండే ఈ సంక్రాంతి రేసులో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే అవకాశం ఉంది.అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

 బాలయ్య చేతిలోకి వెళ్ళిపోయినట్టే:

బాలయ్య చేతిలోకి వెళ్ళిపోయినట్టే:


అదే జరిగితే ఒక రికార్డ్ బాలయ్య చేతిలోకి వెళ్ళిపోయినట్టే రికార్డులలో ఏమాత్రం తగ్గకూడదూ అన్న లక్ష్యం తో ఉన్న ఖైదీనెం.150 కి ఇది కాస్త కలవరపెట్టే వార్తే.. మరి క్రిష్ ఎత్తుగడలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఏమైనా మెగా కాంపౌండ్ కి మరొక కొత్త టెన్షన్ ఏర్పడింది అనుకోవాలి..

 టెన్షన్ లేకుండా:

టెన్షన్ లేకుండా:


అయితే మొత్తం వ్యవహారం లో ఏమాత్రం టెన్షన్ లేకుండా కేవలం ఉత్సాహంగా ఉన్నది సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడే అనుకోవాలి. ఇద్దరుఇ అగ్ర హీరోల మైలు రాళ్ళు అనబడే సినిమాలు ఎప్పుడు వస్తాయా అన్న ఆలోచన తప్ప ఏది ఏ రికార్డు సాధిస్తుందా అన్న టెన్షన్ స్టార్ల వీరాభిమానులకు తప్ప కామన్ ప్రేక్షకుడికి ఏమాత్రం లేదు.

English summary
A sensational feeling of excitement for both the movies Gauthamiputra satakarni and Megastar's Khaidino150. Cine people and entire telugu industry is talking about the outcome of those films. Fans of these two stars are in stream to prove themselves
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu