twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేరొచ్చింది కానీ ...పైసలు రాలడం లేదు

    By Staff
    |

    The Last Lear
    అమితాబ్ ప్రధాన పాత్రలో రితు పర్ణ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ లీర్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది కానీ కమర్షియల్ గా వర్కవుట్ కావటం లేదు. హ్యారీ అనే రిటైరైన స్టేజి ఆర్టిస్టు జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఎప్పుడూ షేక్స్ ఫియర్ నాటకాల్లో డైలాగులు చెబుతూ ఉండే ఆయన దగ్గరకి సిద్దార్ధ(అర్జున్ రాంపాల్) అనే ఫిల్మ్ మేకర్ వస్తాడు. అతను ఆయన్ని తన తీస్తున్న మాస్క్ అనే చిత్రంలో నటించమని కోరుతాడు.

    మొదట ఒప్పుకోడు కానీ సిద్దార్ధ డెడికేషన్ చూసి ఒప్పుకుంటాడు. అప్పుడు పరిచయమవుతుంది షబ్నమ్ (ప్రీతీ జింతా) అనే ఆర్టిస్టు. ఆమె కి నటనలో మెలుకువలు నేర్పిన హ్యారీ ...క్లైమాక్స్ సీన్ లో డూప్ బదులు తానే చేస్తానని పట్టుబడతాడు. అయితే ఆ సన్నివేశం అవగానే కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆద్యతం అమితాబ్ ఈ సినిమాలో మనని ఎంగేజ్ చేస్తూనే ఉంటాడు.

    తన నటనలో విభిన్న కోణాలు చూపుతూ ఆశ్చర్యచకితులను చేస్తాడు. అలాగే అమితాబ్ సహచరి వందన గా వేసిన షిఫాలి షా ఆయనకే పోటీ ఇచ్చేలా సహజ నటనను చూపింది. అయితేనేం కమర్షియల్ గా సినిమా లేకపోవటం స్లో నేరేషన్ రెగ్యులర్ ప్రేక్షకులనుండి దూరం చేస్తున్నాయి. ఇలాంటి సమాంతర సినిమాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉండటం మాత్రం ప్లస్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X