»   » మీకు తెలుసా? రామ్ చరణ్ లో ఈ యాంగిల్ ఉందని

మీకు తెలుసా? రామ్ చరణ్ లో ఈ యాంగిల్ ఉందని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చాలా తక్కువ మందికి తెలుసు రామ్ చరణ్ లో ఆధ్యాత్మిక కోణం ఉందని...దాన్ని ఆయన చాలా తక్కువగా పబ్లిక్ లో ఎగ్జిబిట్ చేస్తూంటారు. కొద్ది నెలల క్రితం అమరనాధ్ యాత్రకు తన తల్లి కోసం వెళ్లటం, తర్వాత ప్రతీ సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకోవటం, తన ఇష్టదైవం హనుమంతుడు గురించి మాట్లాడుతూ ఆయన తన సన్నిహితులతో కనపడుతూంటారు.

The Lesser Known Side Of Ram Charan

అంతే కాదు ఆయన ఇషా ఫౌండేషన్ వ్యవస్దాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కు గొప్ప భక్తుడు. తన తండ్రి, బాబాయ్ పవన్ లాగానే ఆయన ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రపంచానికి తన జీవితంలో సరైన స్దానం కల్పిస్తూంటాడు.

రీసెంట్ గా కాలిఫోర్నియాలో రామ్ చరణ్..స్పిరిట్యువల్ గురు, పబ్లిక్ స్పీకర్ అయిన దీపక్ చోప్రాని కలిసారు. అంతేకాదు ఆయన వర్క్స్ గురించి రామ్ చరణ్ స్టన్ అయ్యారు. దీపక్ చోప్రా సైంటిఫిక్ ఎప్రోచ్ తో ఆయుర్వేదాన్ని, ఆధ్యాత్మికతను పరిశీలించటం తనకు నచ్చిందంటూ తెలియచేసారు.

Thank you for the lovely message #DeepakChopra Jee. Advance #HappyDiwali to everyone . #SanFrancisco

Posted by Ram Charan on 9 November 2015


ఇక దీపక్ చోప్రా సైతం రామ్ చరణ్ తనను కలవటం చాలా ఆనందంగా ఉందంటూ చరణ్ అభిమానులను ఉద్దేశించి ఓ వీడియో మెసేజ్ ఇచ్చారు. రామ్ చరణ్ వంటి స్టార్ ని కలవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి యుఎస్ లో ఓ నెల రోజుల పాటు హ్యాలిడే గడిపి ఈ నెలలో వస్తున్నారు. వచ్చి రాగానే తని ఒరువన్ రీమేక్ లో ప్రీ ప్రొడక్షన్ లో ఆయన పాల్గొంటారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

English summary
Recently, Charan met spiritual guru, author and public speaker, Deepak Chopra in California and was stunned by his works. "Very happy to have met #DeepakChopra- the new age spiritual guru. His books on the scientific approach to Ayurveda and spirituality have blown my mind. Do check him out guys!! #SanDiego #bliss #California", he posted on his official Facebook page.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu