»   »  ‘దిల్ వాలె’ క్లైమాక్స్ మేకింగ్ వీడియో

‘దిల్ వాలె’ క్లైమాక్స్ మేకింగ్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్, కాజోల్ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘దిల్ వాలె'. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై గౌరీఖాన్‌, రోహిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

 The Making Of Shahrukh Khan's 'Dilwale' Climax

సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ మేకింగ్ వీడియోను యుట్యూబ్ ద్వారా విడుదల చేసారు. ఫన్నీగా నవ్వించే విధంగా ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా స్టార్ కాస్ట్ అంతా ఈ క్లైమాక్స్ మేకింగ్ వీడియోలో కనిపించారు.


ఈ చిత్రంలో షారుక్, కాజోల్ తో పాటు యువ జంటగా వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ నటిస్తున్నారు. ఇందులో కార్లను రీమోడలింగ్‌ చేసే వ్యక్తిగా షారుక్‌, ఆయన తమ్ముడిగా వరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ‘చెన్నై ఎక్స్ ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత షారుఖ్‌, రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చత్రానికి ప్రీతమ్‌ సంగీతం సమకూర్చిన పాటలు దీపావళి సందర్భంగా నవంబర్‌ 11న సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 18న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు.

English summary
Dilwale is an upcoming film by Rohit Shetty. Starring Kajol, Shah Rukh Khan, Kriti Sanon and Varun Dhawan, the film is slated to release on 18th December 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu