ట్విస్ట్: ఆమె డబ్బులిచ్చి మరీ కొట్టించుకుందట!
ముంబై: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్‌ను ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పొట్టి దుస్తులు వేసుకుని సంప్రదాయాలు మంటగలుపుతున్నావంటూ మహ్మద్ అఖిల్ మాలిక్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేసాడు. అయితే ఈ వ్యవహారంలో ఇపుడు ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
గౌహర్ ఖాన్ పై అతను చేయి చేసుకోవడం ఓ డ్రామా అని అంటున్నారు. ఆమె అతనికి డబ్బులిచ్చి ఈ వివాదానికి పథకం రచించిందట. ఎందుకిలా చేసిందంటే....అమ్మడు పబ్లిసిటీ కోసమే అతనితో చెంపదెబ్బ కొట్టించుకుందని అంటున్నాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ అఖిల్ మాలిక్ ఈ విషయాన్ని వెల్లడించడంతో బండారం బట్టబయలైంది.

సంఘటనకు మూడు రోజుల ముందు గౌహర్ ఖాన్ అతన్ని కలిసిందని, అతనికి డబ్బులివ్వడంతో పాటు దబాంగ్-3 చిత్రంలో అవకాశం కూడా ఇప్పిస్తానని అతనికి హామీ ఇచ్చిందట. పథకం ప్రకారం మీడియా ముందు మహ్మద్ మాలిక్ గౌహర్ ఖాన్ చెంపచెల్లుమనిపించాడని తెలుస్తోంది.
అయితే గౌహర్ ఖాన్ వాదన మాత్రం మరోలా ఉంది. అతడు చెబుతున్న దాంట్లో నిజం లేదని, అతనితో ఎలాంటి ఒప్పందం లేదని, అసలు అంతకుముందు అతను ఎవరో కూడా తనకు తెలియదని ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరి ఇందులో ఎవరి మాట నమ్మాలో ఏమో?


Click it and Unblock the Notifications











