'అందాల రాక్షసి' ఫిలాసఫీ ఏమిటి?
హైదరాబాద్: అందాల రాక్షసి సినిమాగా రూపొందిన ముక్కోణపు ప్రేమ కథ శుక్రవారం విడుదలైంది. ఈ ప్రేమకథకు ఓ ఫిలాసపీ ఉందని, దీనికి తాత్విక నేపథ్యం ఉందని దర్శకుడు హను రాఘవపూడి అంటున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమికి మధ్య గల సంబంధాన్ని ఈ సినిమా ప్రతిఫలిస్తుందని దర్శకుడు హను అన్నారు. విశ్వంలోని ఈ మూడింటి మధ్య గల అనుబంధానని అందాల రాక్షసి కళ్లకు కడుతుందని చెప్పారు.
ఈ సినిమాకు కొర్రపాటి నిర్మాత కాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హను దర్శకుడిగా తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయమవుతున్నారు. లావణ్య, నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. రాధన్ సంగీతాన్ని సమకూర్చారు. అందాల రాక్షసి పబ్లిసిటీ కోసం పెద్ద యెత్తున సొమ్ము ఖర్చు చేసినట్లు ప్రచారం సాగుతోంది. సినిమా నిర్మాణాని కన్నా ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారని చెబుతున్నారు. ప్రమోషన్ ఎంత అవసరమో గుర్తించినట్లు రాజమౌళి ఇటీవల అన్న విషయం తెలిసిందే.
హనురాఘవపూడి దర్శకుడుగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రం ప్రోమోలు,పోస్టర్లలతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. నవీన్‌చంద్ర రాహుల్, లావణ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఎస్.ఎస్.రాజవౌళి మాట్లాడుతూ చిత్రంపై నమ్మకంతోనే తాను నిర్మాతగా మారానని, నిర్మాతగా మారడానికి దర్శకుడు హను రాఘవపూడి కూడా ఓ కారణమని, నిర్మాతపై నమ్మకంతోనే తానీ చిత్రానికి కొంత షేర్ కలిశానని తెలిపారు.


Click it and Unblock the Notifications











