»   » బాహుబలి2 గోల్డ్ టికెట్ ఇదే.. ముంబైలో వరల్డ్ ప్రీమియర్.. బాలీవుడ్ దిగ్గజాలకు ఆహ్వానం (ఫొటోలు)

బాహుబలి2 గోల్డ్ టికెట్ ఇదే.. ముంబైలో వరల్డ్ ప్రీమియర్.. బాలీవుడ్ దిగ్గజాలకు ఆహ్వానం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం రిలీజ్‌‌కు రంగం సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ ప్రీమియర్‌ను బాలీవుడ్ దిగ్గజాల కోసం గురువారం (27 ఏప్రిల్) రోజున ప్రదర్శించనున్నారు. ఈ మేరకు హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ముంబైలోని ఓ ప్రముఖ థియేటర్‌లోని 70 ఎంఎం స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు.

ప్రముఖులకు కరణ్ ఆహ్వానం

ప్రముఖులకు కరణ్ ఆహ్వానం

హిందీలో బాహుబలి2 సినిమాను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పంపిణీ చేస్తున్నారు. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా వరల్డ్ ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారని ముంబైకి చెందిన ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. ఈ ఇన్విటేషన్‌కు సంబంధించిన మిలమిల మెరిసే కార్డు ఇదే.


అందంగా గోల్డ్ టికెట్

అందంగా గోల్డ్ టికెట్

మంచి దళసరి కవర్ పేజీలతో ఇన్విటేషన్‌ను డిజైన్ చేశారు. వీటిపై గోల్డ్ టికెట్ అని ముద్రించారు. దానిపై వరల్డ్ ప్రీమియర్ బాహుబలి2 అని ముద్రించారు.


శివగామి చేతుల్లో బాహుబలి.

శివగామి చేతుల్లో బాహుబలి.

బాహుబలి ప్రీమియర్ ఆహ్వానంపై బాహుబలిని శివగామి దేవి ఎత్తుకొన్న చిత్రాన్ని ముద్రించారు. బాహుబలి1 చిత్రానికి ఈ సీన్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


రాజమౌళి దర్శకుడే కాదు..

రాజమౌళి దర్శకుడే కాదు..

దర్శకుడు కరణ్ జోహర్ డిజైన్ చేసిన ఈ ఇన్విటేషన్ కార్డులో ‘ఎస్ఎస్ రాజమౌళి కేవలం అద్భుతమైన దర్శకుడే కాదు. గొప్ప విజన్ ఉన్న సినిమా నిర్మాత కూడా. ఆయకు ఉన్న సినిమాటిక్ టెక్నాలజీ, కథ చెప్పే విధానం అమోఘం అని రాసినట్టు సమాచారం.


ఐదేళ్ల శ్రమ..

ఐదేళ్ల శ్రమ..

దాదాపు ఐదేళ్లపాటు అవిశ్రాతంగా శ్రమించి అద్భుతంగా బాహుబలి చిత్రాన్ని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ నిర్మించారు. ఎస్ఎస్ రాజమౌళి విజన్‌ను నమ్మి వారు భారీగా పెట్టుబడి పెట్టడం విశేషం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28న 9 వేల థియేటర్లలో విడుదల అవుతున్నది.


English summary
The grand premiere of Baahubali 2 will take place on Thursday (27th April) in Mumbai where many Bollywood biggies will experience the magnum opus on the 70mm. The makers of the movie are leaving no stone unturned to make it grander and these premiere invitaion cards are the proof of what we are saying.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu