»   » హాట్ టాపిక్: 'ఈగ' కథ వెనక అసలు కథ

హాట్ టాపిక్: 'ఈగ' కథ వెనక అసలు కథ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రాజమౌళి సూపర్ హిట్ చిత్రం 'ఈగ' చిత్రం 'Cockroach'(బొద్దింక) అని షార్ట్ ఫిలిం కాపీ అంటూ నేషనల్ మీడియాలో ఆ మధ్యన కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి తండ్రి కథ వెనక అసలు కథ చెప్పి వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లో..ఆ కథ..తను హాలీవుడ్ కోసం రాసుకున్న కథ అని తేల్చి చెప్పారు.

  చాలా కాలం క్రితం తనో కథ 18 వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో నల్ల జాతీయులపై రాసుకున్నానని అన్నారు. అప్పట్లో ఆమెరికాలో బానిస వ్యవస్ద ఉండేది. తమ జాతిని కాపాడటానికి,బానిసత్వం నుంచి స్వేఛ్చ ప్రసాదించటానికి ఓ నల్లజాతి యోధుడు పోరాటం చేసి మరణిస్తాడు. తర్వాత జన్మలో అతనికి రెక్కలొస్తాయి. ఆకాశంలో ఎగిరే శక్తి వస్తుంది. అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంకుది. ఇదే కథలో ఎగిరే లక్షణం,రివేంజ్ అనే పాయింట్ తీసుకుని ఈగ కథ రెడీ చేసామని చెప్పుకొచ్చారు.

  రాజమౌళి మాట్లాడుతూ... " ఈగ తో 'Cockroach'కి పోలికలు తెస్తున్నారు. నేను ఈ 'ఈగ' చిత్రం చేసే సమయంలో జంతువుల మీద చేసిన అనేకమైన యానిమేషన్ సినిమాలు చూసాను. కుక్క పునర్జన్మ ఎత్తి పగ తీర్చుకోవటం అనే అంశంపై వచ్చిన 'fluke'చూసాను. కాబట్టి ఎవరూ 'Cockroach','fluke' తో కానీ పోల్చవద్దు. నాకు అలాంటి ఆరోపణలు వింటే బాధ కలుగుతుంది. కానీ క్లియర్ గా చెప్పగలను. ఏవన్నా అంశాలు కలిస్తే కేవలం కాకతాళీయమే కానీ కాపీ కాదు..ఈగ ఒరిజనలే ", అన్నారు.

  బాలీవుడ్ కి చెందిన ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఈ చిత్రం ఓ ఆస్ట్రేలియన్ షార్ట్ పిలిం నుంచి కాపీ చేసి తీసారంటూ రాసుకొచ్చింది. ఆ షార్ట్ పిలిం పేరు 'Cockroach'(బొద్దింక). మార్చి 2010లో వచ్చిన ఈ షార్టి ఫిలిం కథ దర్శకుడు లూక్ ఈవ్ (Luke Eve). ఈ షార్ట్ ఫిలింలో ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయి బొద్దింక గా పునర్జన్మ ఎత్తుతాడు. బొద్దింకగా తన గర్ల్ ప్రెండ్ ని కలుసుకుంటాడు. అది ఓ రొమాంటిక్ కామెడీ. అయితే రాజమౌళి తన తండ్రి దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ కథను తనకు చెప్పారంటున్నారు.

  English summary
  Director Rajamouli last released movie ‘Eega’ also faced the same situation. Many people said that the movie is a copy of a short film named ‘Cockroach’. But here Rajamouli’s father clarifies this. It seems many years ago Rajamouli’s father has written a story to make it in Hollywood.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more