»   » సంక్రాంతి విజేత ఎన్టీఆర్ కాదు, వెంకటేష్ కాదు..మరి ఇంకెవరు..??

సంక్రాంతి విజేత ఎన్టీఆర్ కాదు, వెంకటేష్ కాదు..మరి ఇంకెవరు..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత సంక్రాంతి సీజన్ కు ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ 'అదుర్స్' అంటూ మనముందుకు వస్తే వెంకటేశ్ 'నమో వెంకటేశ'తో ప్రత్యక్షమయ్యాడు. ఇందులో అదుర్స్ బాక్సాఫీసు వద్ద అదరగొడితే, నమో వెంకటేశ మంచి ఫ్యామిలీ ఎంటర్టెయ్నర్ గా నిలిచింది. మరి సంక్రాంతి విజేత ఎవరు అంటే కలెక్షన్ల పరంగా అయితే ఇప్పటికే 30 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ 'అదుర్సే' అని చెప్పవచ్చు.

కానీ ఇక్కడొకరు ఈ సంక్రాంతి సీజన్ కింగ్ ఎన్టీఆర్ కాదు, వెంకీ కాదు నేనే అంటున్నారు. ఇది విన్న వారు కూడా అతని మాటలతో ఏకీభవిస్తున్నారు. ఇంతకీ ఎవరా అని ఆలోచిస్తున్నారా..?? అదుర్స్ సినిమాలో చారి ప్రియురాలు చందు అదేనండీ నయనతారకు బీటేసిన ముదురు బెండకాయ బట్టు, నమో వెంకటేశ లో హీరోని ఫుట్ బాల్ ఆడుకున్న ప్యారీస్ ప్రసాదు. చేసిన ఈ రెండు పాత్రల్లోనూ ఇట్టే ఒదిగిపోయిన ఆయన కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకుడికి ధీటుగా తన పాత్రలు ఉండటం, ఆయా పాత్రల్లో ఆయన ఒదిగిపోయి నటించడంతో ఈ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాల్లో కథానాయకుడి కన్నా బ్రహ్మికే ఎక్కువ మార్కులు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతగా ఆయన నవ్వించాడు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమయిన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకూ బ్రహ్మానందం కథానాయికల కన్నా అధిక పారితోషికం పొందాడట. నమో వెంకటేశ సినిమాకు కోటి రూపాయలు, అదుర్స్ సినిమాకు 80 లక్షల చొప్పున పారితోషికం పొందారని సమాచారం. మరి ఇప్పుడు చెప్పండి సంక్రాంతి విజేత ఎవరో...!! ఖచ్చితంగా బ్రహ్మీయే....!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu