ఏది నిజం?.... డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాలపై పుకార్లు!
హైదరాబాద్: సంక్రాంతికి పండగ సందర్భంగా నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన ‘డిక్టేటర్' సినిమాతో పాటు, జూ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' సినిమాలు ఈ పండక్కి పోటాపోటీగా విడుదలవుతున్నాయి.
బాలయ్య... జూ ఎన్టీఆర్ వర్గాల మధ్య పడటం లేదని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని షాకింగ్ పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో రాజకీయం జరుగుతోందని, కొన్ని చోట్ల బాలయ్య సినిమా ‘డిక్టేటర్'తో పోలిస్తే కేటాంపుల విషయంలో జూ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' సినిమా అన్యాయం జరుగుతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రచారంలో నిజం ఎంతో తేలియడం లేదు. అన్యాయం జరుగుతోందని ‘నాన్నకు ప్రేమతో' డిస్ట్రిబ్యూటర్ల నుండి ఎలాంటి కంప్లయింట్ లేదు. అయితే వీరు అధికార పార్టీకి భయపడి బయట పడటం లేదనే ఓ వాదన కూడా ఉంది. మరి ఈ పుకార్లలో నిజం ఎంత? ఎవరైనా ప్రత్యర్థులు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 99వ చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. జనవరి 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











