తెల్లవారితే గురువారం ట్విట్టర్ రివ్యూ: అన్ని చోట్లా అదే టాక్.. .. రాజమౌళి ఫ్యామిలీకి ఫస్ట్ టైమ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి అతడి సోదరుడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి ఎన్నో ఏళ్లుగా తమ మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరూ తమ తమ రంగాల్లో సత్తా చాటుతూ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కీరవాణి కుమారుడు శ్రీ సింహా 'మత్తు వదలరా' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. దీని తర్వాత ఇప్పుడు 'తెల్లవారితే గురువారం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ప్రీమియర్ షోలు ముగిసిన ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ మీకోసం!

‘మత్తు వదలరా'తో మెప్పించిన శ్రీ సింహా
కీరవాణి తనయులు శ్రీ సింహా హీరోగా.. కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయిన చిత్రమే 'మత్తు వదలరా'. క్లైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను రితేష్ రాణా రూపొందించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ చిత్రం డీసెంట్ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల స్పందనను అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుని సత్తా చాటిందీ మూవీ.

తెల్లవారితే గురువారం అంటూ వచ్చారు
మొదటి సినిమాతోనే మెప్పించిన శ్రీ సింహా ఇప్పుడు 'తెల్లవారితే గురువారం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మణికాంత్ రూపొందించిన ఈ సినిమాను రజినీ కొర్రపాటి, బెనర్జీ ముప్పననేని సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఇందులో చిత్ర శుక్లా, మిశా నారంగ్ హీరోయిన్లు. సత్య, వైవా హర్ష తదితరులు నటించారు.

టీజర్, ట్రైలర్‌తో భారీగా పెరిగిన అంచనా
టైటిల్‌లోనే కొత్తదనం ఉండడంతో 'తెల్లవారితే గురువారం' సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే పోస్టర్, టీజర్, ట్రైలర్లు విడుదల అయిన తర్వాత మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రమోషన్ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్, రాజమౌళిని తీసుకొచ్చి హైలైట్ చేశారు.

రిలీజ్ కూడా గ్రాండ్‌గా.. ప్రీమియర్ షోలు
రాజమౌళి ఫ్యామిలీకి చెందిన హీరో కావడంతో 'తెల్లవారితే గురువారం' మూవీపై ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా బిజినెస్ కూడా గణనీయంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇక, రిలీజ్ కూడా మంచిగానే ప్లాన్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ థియేటర్లు దొరికాయి. ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి.

‘తెల్లవారితే గురువారం' ట్విట్టర్ రివ్యూ
యూఎస్‌లో ప్రీమియర్ షోలో ముగిసిన తర్వాత ప్రేక్షకులంతా 'తెల్లవారితే గురువారం' సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిని రిపోర్టులను ఆధారంగా చేసుకుంటే.. ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఆడియెన్స్ అందరూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చూసిన ఫీల్ ఉందని అంటున్నారు.

రాజమౌళి ఫ్యామిలీకి అలా ఫస్ట్ టైమ్
ఇప్పటి వరకు దర్శకుడిగా రాజమౌళి, సంగీత దర్శకుడిగా కీరవాణి ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు 'తెల్లవారితే గురువారం'తో ఆ కుటుంబం నుంచి శ్రీ సింహా భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో శ్రీ సింహా యాక్టింగ్, కాల భైరవ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అంటున్నారు.

సినిమాకు ప్లస్ అతడే.. మైనస్ ఇదే
'తెల్లవారితే గురువారం' సినిమా తన పెళ్లిని తప్పించుకోడానికి హీరో చేసే ప్రయత్నాలతో సాగుతుంది. అతడి స్నేహితుడిగా కమెడియన్ సత్య సినిమాకే హైలైట్ అయ్యాడని అంటున్నారు. వైవా హర్ష కూడా అదరగొట్టాడని చెబుతున్నారు. దర్శకుడు చూపించి కామెడీ ట్రాక్ సూపర్ ఉందట. హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారని టాక్. మొత్తంగా సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











