twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్ రావాల్సిందే.. అప్పటి వరకు ఈ పరిస్థితి ఇంతే..!

    |

    Recommended Video

    Rangasthalam Will Open The Summer Season

    2018 కొత్త సంవత్సరం మొదలై ఒకటిన్నర నెల గడుస్తున్నా టాలీవుడ్ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పటికే అదే తరహా లీస్ట్ సక్సెస్ రేట్ తో నిర్మాతలు బండి లాగిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో బడా చిత్రాలతో బాక్స్ ఆఫీస్ సందడి మొదలైంది. ఆ తరువాత అక్కడక్కడా కొన్ని మెరుపులు మినహా పెద్దగా ఈ చిత్రం ప్రభావం చూపలేదు. ఇటీవల విడుదలైన తొలిప్రేమ చిత్రం మాత్రం ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో స్పష్టంగా తన హవా కొనసాగిస్తోంది. మళ్ళీ మార్చి నెలాఖరు వరకు బాక్స్ ఆఫీస్ ఖాళీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

    మొదలెట్టిన అజ్ఞాతవాసి, జై సింహా

    మొదలెట్టిన అజ్ఞాతవాసి, జై సింహా

    ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ఇద్దరు బడా హీరోల చిత్రాలతో సందడి మొదలైంది. కానీ అజ్ఞాతవాసి చిత్రం మాత్రం అంచనాలని అందుకోలేదు. బాలయ్య జై సింహా చిత్రం మాత్రం నిర్మాతకు లాభాల పంట పండించింది.

    అంతగా కనిపించని సందడి

    అంతగా కనిపించని సందడి

    సంక్రాంతి సీజన్ ముగిసాకా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి బాగా తగ్గింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన భాగమతి చిత్రం రాణించింది. ఆ తరువాత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ టచ్ చేసి చూడు చిత్రంతో నిరాశ పరిచాడు.

    తొలిప్రేమ మెరుపులు

    తొలిప్రేమ మెరుపులు

    ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో బిగ్ హిట్ గా నిలిచింది. యువత ఈ చిత్రానికి బ్రహ్మ రధం పట్టడంతో బాక్స్ ఆఫీస్ సందడిగా మారింది.

    విష్ణు..నిఖిల్.. ఇంకా క్లారిటీ లేదు

    విష్ణు..నిఖిల్.. ఇంకా క్లారిటీ లేదు

    విష్ణు ఆచారి అమెరికా యాత్రతో, నిఖిల్ కిర్రాక్ పార్టీ చిత్రంతో రెడీగా ఉన్నారు. కానీ ఈ చిత్రాల విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. త్వరలో విడుదల కావలసి ఉన్న ఓ మోస్తరు అంచనాలు ఉన్న చిత్రాలు ఇవే. ఆచారి అమెరికా యాత్ర చితా పూర్తి వినోదాత్మక చిత్రంగా, కిర్రాక్ పార్టీ యువతని ఆకట్టుకునే చిత్రాలుగా రాబోతున్నాయి.

    మార్చి మొత్తం ఖాళీ..కారణం అదేనా

    మార్చి మొత్తం ఖాళీ..కారణం అదేనా

    సాధారణంగా మార్చి నెలలో చిత్రాలని విడుదల చేయడానికి నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించారు. ఎంతుకంటే సినిమాలని ఆదరించే యువత మొత్తం పరీక్షల హడావిడిలో ఉంటారు కనుక. ఈ సారి కూడా మార్చి నెల వెలవెల బోనుంది. ఒకటి రెండు చిన్న చిత్రాలు మిహానా మార్చిలో మరే సినిమా విడుదలకు సిద్ధంగా లేదు.

    అదునుచూసి అడుగుపెట్టబోతున్న రాంచరణ్

    అదునుచూసి అడుగుపెట్టబోతున్న రాంచరణ్

    యువత పరీక్షల హడావిడి ముగిసాకా వేసవిలో పేలే తొలి బాంబు రంగస్థలం. మార్చి నెలాఖరున అంటే 30 వ తేదీన చరణ్ తన చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మందు వేసవి ఏప్రిల్ లో అల్లుఅర్జున్, మహేష్ వంటి బడా హీరోలు బాక్స్ ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

    English summary
    There is no big movie till March end. Rangasthalam will open the summer wa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X