»   » కొమురం పులి పై స్టే ఏమీలేదు...ఖండన

కొమురం పులి పై స్టే ఏమీలేదు...ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్యల కాంబినేషన్ లో రూపొందిన కొమురం పులి తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సింగిల్ కట్ కూడా పడలేదు. అయితే ఎ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారు. ఇక పులి చిత్రం మొదటి ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ అయిన అల్లు శిరీష్ చెప్తున్నారు. అలాగే మీడియాలో కొమురం పులిపై స్టే అని వచ్చిన వార్తలను సైతం ట్విట్టర్ లో శిరీష్ ఖండిస్తూ...కొమురం పులి చిత్రంపై ఏ విధమైన స్టే లేదు. స్టే కోరుతూ ఓ కోర్టు కేసు ఒకటి రిజిస్టర్ అయింది. అదీ గ్రాంట్ కాలేదు. ఇక ఈ విషయాన్ని క్లియర్ చేసే పనిలో నిర్మాత శింగనమల రమేష్ బిజీగా ఉన్నారు అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu