twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడవాలన్నా, నవ్వాలన్నా.. అదే నటన : శ్రియ

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రేమను చాటాలన్నా, ఏడవాలన్నా, నవ్వాలన్నా.. అన్నింటిలోనూ అదే నటన. అన్ని భాషల చిత్రాలు చేయడం వల్ల చాలా విషయాలను తెలుసుకోగలం. అన్ని రకాల సంప్రదాయాలనూ చూడొచ్చు. ఆహారపు అలవాట్లు తెలుస్తాయి. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ లలో నటించడం చాలా సులువుగా అనిపించింది. భాషలు వేరు కావొచ్చు, కానీ ఏ సినిమాలోనైనా పలికించే భావాలు మాత్రం ఒక్కటే అంటూ చెప్పుకొచ్చింది శ్రియ. తమిళంలో తన కొత్త చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

    తన సినిమాల్లో తనకు నచ్చిన పాటలగురించి చెప్తూ... దేవిశ్రీప్రసాద్‌ సంగీతం దర్శకత్వంలో వచ్చిన 'మలై' గీతాలు చాలా ఇష్టం. అందులోని 'నీ వరుంబోదు..' పాటంటే చెవికోసుకుంటా. ఇక ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు సమకూర్చిన 'శివాజి'లోని 'ఆంబల్‌..' పాటను ఎన్నోసార్లు విన్నా అంది. : ప్రేమ, పెళ్లి గురించి చెప్తూ... ప్రకృతిలో ఎంతో గొప్ప విషయం ప్రేమ. అత్యంత వ్యక్తిగతం కూడా. ఎవరి ప్రేమ విషయంలోనూ జోక్యం చేసుకోకూడదనేది నా అభిప్రాయం. ఇక.. పెళ్లి గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటా. వీలైనంత త్వరలోనే నా చేతివేలికి ఉంగరం చూడొచ్చు అని చెప్పుకొచ్చింది.

    రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి చెప్తూ... నిరాడంబర వ్యక్తి. ఆయనలా ఎవర్నీ చూడలేదు. అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. అందరి మంచి కోరుకుంటారు. సెట్‌లోనూ, బయట సింప్లిసిటీని కొనసాగిస్తారు. అంతేకాదు.. ఈగోలేని నటుడు. ఆశ్చర్యానికి కలిగించే గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ ఏడాది దీపావళి గురించి చెప్తూ... ముంబయిలోనే ఈ సారి పండుగ. కుటుంబికులు, స్నేహితులతో జరుపుకుంటా. నాకు నచ్చిన పండుగ ఇది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కొత్తదుస్తులు, మిత్రుల సందడి, రంగుల దీపాలు.. ఎంతో సంతోషంగా గడుపుతా అంది.

    తెలుగులో ' ఇష్టం' చిత్రం ద్వారా ,తమిళ్ లో 'ఎనక్కు20 ఉనక్కు 18ఇష్టం' తో అడుగుపెట్టిన అందాలతార శ్రియ. ఆ తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోయింది. తమిళంలో అయితే జయంరవితో 'వర్షం'లో తడిసి అక్కడి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకుంది. రజనీకాంత్‌తో 'శివాజి', ధనుష్‌తో 'తిరువిళయాడల్‌', విజయ్‌తో 'అళగియ తమిళ్‌మగన్‌' చిత్రాలు చేసి మంచిపేరు సంపాదించింది. హిందీ చిత్ర పరిశ్రమపై అమ్మడు దృష్టిపెట్టడంతో కోలీవుడ్‌లో క్రేజీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. తిరిగి ఆ స్థాయికి చేరుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది. కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు. తాజాగా తెలుగులో అక్కినేని త్రయం నటిస్తున్న 'మనం', హిందీలో 'వాల్మీకి..'లో నటిస్తోంది.

    English summary
    On working in different regional film industries in India Shriya Saran has stated, "I don’t consider Kollywood or Bollywood as separate entities. For me, there’s only a single category, the Indian film industry, which is extremely rich owing to its diverse genres and languages. She is fluent in Hindi, English, and can understand Tamil and Telugu well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X