»   » శ్రీదేవి కూతురుకు షాకిచ్చిన కరణ్ జోహర్.. బీ కేర్ ఫుల్..

శ్రీదేవి కూతురుకు షాకిచ్చిన కరణ్ జోహర్.. బీ కేర్ ఫుల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతకొద్దికాలంగా బాలీవుడ్‌లోకి శ్రీదేవీ కూతురు జాహ్నవి కపూర్ ఎంట్రీ గురించి రకరకాల రూమర్లు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పర్యవేక్షణలో జాహ్నవి తెరంగేట్రం చేస్తున్నదనే వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. తొలి చిత్ర ప్రవేశ ప్రకటన వెలువడే వరకు మీడియాకు దూరంగా ఉండాలని హెచ్చరించారట.

అనేక రూమర్లు

అనేక రూమర్లు

మరాఠీ చిత్రం సైరట్ చిత్రంలో షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కపూర్‌కు జంటగా నటిస్తున్నదని ఓసారి, కరణ్ జోహర్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటిస్తున్నదని మరోసారి వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ధ్రువీకరణ జరుగలేదు.

ప్రచారానికి దూరంగా ఉండు..

ప్రచారానికి దూరంగా ఉండు..

ఈ నేపథ్యంలో తొలి చిత్ర ప్రవేశం జరిగే వరకు మీడియా ప్రచారానికి దూరంగా ఉండాలని జాహ్నవికి కరణ్ జోహర్ ఇటీవల సూచించాడట. మీడియా కంటికి చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలని గట్టిగానే చెప్పినట్టు బాలీవుడ్ చెందిన ఆంగ్ల పత్రిక కథనాన్ని వెలువరించింది.

సొంత ప్రొడక్షన్‌లో సినిమా

సొంత ప్రొడక్షన్‌లో సినిమా

సొంత ప్రొడక్షన్‌లో జాహ్నవిని బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు కరణ్ జోహర్ సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు జాహ్నవి ఎలాంటి రూమర్ల బారిన పడకుండా కరణ్ జాగ్రత్తలు తీసుకొంటున్నారట.

బాయ్‌ఫ్రెండ్‌తో పబ్‌లో.

బాయ్‌ఫ్రెండ్‌తో పబ్‌లో.

జాహ్నవి ఈ మధ్యకాలంలో అర్ధరాత్రి బాయ్‌ఫ్రెండ్‌ శిఖర పహారియాతో కలిసి పబ్‌లో చిందేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఫ్రెండ్స్ తో కలిసి విందులు, వినోదాల్లో మునిగి తేలడం హాబీగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాహ్నవిని కరణ్ జోహర్ గట్టిగానే మందలించినట్టు సమాచారం.

English summary
Karan Johar, who is all set to launch Jhanvi Kapoor in one of his productions, has instructed her to stay away from the limelight until her debut film is announced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu