»   » రజినీ కాంత్ సినిమాని మరీ ఇంతలా రోడ్డుకి లాగాలా?? కబాలీ చేసిన 52 తప్పులివే అంటూ.. (వీడియో)

రజినీ కాంత్ సినిమాని మరీ ఇంతలా రోడ్డుకి లాగాలా?? కబాలీ చేసిన 52 తప్పులివే అంటూ.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాపై భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ యావ‌త్తు ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. పెద్ద‌స్థాయిలో ప్ర‌చారంతో సినిమా చుట్టూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌బాలి క‌ల‌క‌లం క‌నిపిస్తోంది. వ‌రుస ఫ్లాప్ లతో సాగుతున్న హీరో సినిమా అయిన‌ప్ప‌టికీ ఈ స్థాయిలో రిలీజ్ కి ముందే జ‌నంలో మేనియాగా మార‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అయిన‌ప్ప‌టికీ ర‌జ‌నీకాంత్ స్టామినాను గుర్తు చేసిన సినిమాగా క‌బాలి నిలిచిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఓ రేంజ్ హైప్ క్రియేట్ కావ‌డంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి తన వైపుకు తిప్పుకుంది. ఫ్యాన్స్, క్రిటిక్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. వయసు మళ్లిన డాన్ పాత్రలో రజినీకాంత్ అద్భుతమైన నటనను కనబరిచారు. 65 ఏళ్ల వయసులోనూ తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని నిరూపించారు.

గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజినీకాంత్ నటించి మెప్పించిన చిత్రం కబాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి తన వైపుకు తిప్పుకుంది. ఫ్యాన్స్ , క్రిటిక్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. వయసు మళ్లిన డాన్ పాత్రలో రజనీకాంత్ అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు.

సాల్ట్ పేప్పర్ లుక్‌తో ఆయన మేనరిజమ్స్, డైలాగ్స్...ప్రతిదీ వైవిధ్యంగా ఉండగా, డాన్ అంటే ఇలాగే వుండాలనే విధంగా ఆయన ఆహార్యం కనిపించింది. 65 ఏళ్ల వయసులోనూ తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని నిరూపించారు రజినీ. పా రంజిత్ టేకింగ్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయింది. అయితే ఈ చిత్రంలో 52 తప్పులు ఉన్నాయని డ్రీమ్ హౌజ్ ఎంటర్ టైన్మెంట్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసం చేసిందే తప్ప మూవీని కించపరచాలనే ఉద్దేశంతో కాదని వారు తెలిపారు. ఆ 52 తప్పులేమిటో మీరే చూడండి మరి.

English summary
Despite being the box office hit there are some mistakes in the movie KABALI which you didn’t notice. A video has surfaced online featuring about 52 mistakes from the Rajinikanth starrer
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu