»   »  హీరోయిన్లపై లైంగిక దాడులు జరిగిన వివిధ సంఘటనలు!

హీరోయిన్లపై లైంగిక దాడులు జరిగిన వివిధ సంఘటనలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: ప్రముఖ మళయాల నటి, తెలుగులో మహాత్మ చిత్రంలో నటించిన హీరోయిన్ మీద ఇటీవల లైంగిక వేధింపుల సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన యావత్ సీని పరిశ్రమనే షాకయ్యేలా చేసింది.

ఈ లైంగిక వేధింపుల సంఘటన వెనక....హీరోయిన్ వద్ద పని చేసిన డ్రైవరే కీలక సూత్రధారి. ఈ కేసుతో ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల హస్తం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

'యత్ర నార్యస్తు పూజ్యన్తే, రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యన్తే, సర్వాస్తత్రా ఫలాఃక్రియాః

''స్త్రీని గౌరవించే చోట తలపెట్టిన కార్యాలన్నీ సఫలమౌతాయి. ఆడదాన్ని అవమానించే చోట కార్యాలన్నీ విఫలమౌతాయి. అదీ సమాజంలో స్త్రీకి ఉండాల్సిన స్థానం. కానీ, ఇప్పుడేమౌతోంది? ఎంతోమంది కీచకులు మన కళ్ళముందే ఉన్నారు. దేశంలో ప్రతి రోజూ జరుగుతున్న ఎన్నో సంఘటనలే ఇందుకు నిదర్శనం.

సామాన్య ప్రజలు మాత్రమే కాదు... హీరోయిన్ల మీద కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇలాంటి దాడులు జరుగుతుండటం శోయనీయం. గతంలో పలువురు హీరోయిన్ల మీద కూడా ఇలాంటి లైంగిక వేధింపుల ఘటనలు చేసుకున్నాయి.

 వరలక్ష్మి

వరలక్ష్మి

స్టార్ హీరోల కూతుళ్లకు కూడా ఈ సమాజంలో రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వెలుగెత్తి చూపే మీడియా సక్కిల్ లో కూడా ఎంతో మంది కీచకలు ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఇటీవల ఓ మీడియా పర్సన్ నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నగ్మ వివాదం

నగ్మ వివాదం

నటి నగ్మా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు మీరట్లోని పబ్లిక్ ర్యాలీలో పాలుపంచుకోగా స్థానిక ఎమ్మెల్యే గజ్ రాజ్ ఆమెను బలవంతంగా ముద్దాడిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. నగ్మకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

 శ్రీయ

శ్రీయ

2008లో 'శివాజీ' సినిమా రిలీజ్ సమయంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీయకు ఓ వ్యక్తి నుండి ఇలాంటి అనుభవే ఎదురైతే.... అక్కడే అతడి చెంపచెల్లుమనిపించింది శ్రీయ.

 ప్రియమణి

ప్రియమణి

2012లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్బంగా హీరోయిన్ ప్రియమణి లైంగిక వేధింపులకు గురైనట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

 జెనీలియా

జెనీలియా

విజయవాడలో ఓ షోరూం ఓపెనింగుకు వచ్చిన జెనీలియాను అప్పట్లో అభిమానులు చుట్టు ముట్టారు. ఈ సందర్బంగా తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించింది జెనీలియా.

 నయనతార

నయనతార

నయనతార గతంలో ఓ స్కూల్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్‌కు చేరుకోగా అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆమెను చుట్టుముట్టేశారు. ఫ్యాన్స్ ముసుగులో కొందరు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

 స్మిత

స్మిత

కన్నడ నటి స్మిత మీద కూడా గోవాలో ఇలాంటి వేధింపుల సంఘటన చోటు చేసుకుంది. గోవాలో రిలాక్స్ అయ్యేందుకు వెళ్లిన ఆమెపై బీచ్ లో కొందరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

 ఆమెపై రేప్ జరుగలేదు: దర్శకుడి వివరణ, అశ్లీలంగా ఫోటోలు, బ్లాక్ మెయిల్...

ఆమెపై రేప్ జరుగలేదు: దర్శకుడి వివరణ, అశ్లీలంగా ఫోటోలు, బ్లాక్ మెయిల్...

మళయాల నటి రేప్ కు గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఖండించారు. తాను స్వయంగా ఆమెతో మాట్లాడానని, తాను రేప్ కు గురి కాలేదని, వేధింపులకు గురైనట్లు ఆమె తెలిపారు... దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపాలని ప్రియదర్శన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
A popular Malayalam actor was abducted and molested by a gang of six in Kerala. However, this is not the first instance where an actor has been sexually assaulted. Varalakshmi, Shriya, Nayantara, jenelia, Priyamani also faced some horrific experiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu