»   » మన ప్రభాస్‌కు.... ఆ గౌరవం దక్కడాన్ని సహించలేకపోతున్నారు!

మన ప్రభాస్‌కు.... ఆ గౌరవం దక్కడాన్ని సహించలేకపోతున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని మరో లెవల్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవల్లో తెలుగు పరిశ్రమ పేరు నిలబెట్టిన సినిమా ఇది. సినిమాతో పాటు ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ పేరు కూడా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది.

బాహుబలి సినమా ద్వారా ప్రభాస్ ఇంటర్నేషనల్ రేంజిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో మేడమ్ టుస్సాడ్స్..వారు ప్రభాస్ ను సంప్రదించి ఆయనకు ఓ శుభవార్త చెప్పారు. ప్రముఖుల మైనపు విగ్రహాలను తమ మ్యూజియంలో ప్రతిష్టించే ఈ సంస్థ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని కూడా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇటీవలే మ్యూజియం ప్రతినిధులొచ్చి ప్రభాస్ కొలతలు తీసుకుని వెళ్లారు.

ఇప్పటి వరకు ఇండియా నుండి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ ప్రముఖులకు మాత్రమే ఈ మ్యూజికలో చోటు దక్కింది. దక్షిణాది నుండి ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటుడు ప్రభాస్.

తెలుగు ఫ్యాన్స్ హ్యాపీ

తెలుగు ఫ్యాన్స్ హ్యాపీ

ప్రభాస్ కు ఈ అవకాశం దక్కడంపై తెలుగు అభిమానులు సంతోషంగానే ఉన్నారు. దక్షిణాది నుండి తొలిసారి ఒక తెలుగోడికి ఈ గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులే లేవు.

వారు సహించలేక పోతున్నారు.

వారు సహించలేక పోతున్నారు.

అయితే ప్రభాస్‌కు ఈ గౌరవం దక్కడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా తమిళ సినీ ప్రేమికులు. తాజాగా ప్రముఖ తమిళ పత్రిక ఒకటి ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టడంపై ఓ కథనం ప్రచురించింది. ప్రభాస్‌కు మైనపు విగ్రహం ఏమిటి అంటూ తన ఏడుపునంతా వెల్లగక్కింది.

వారికి దక్కలేదనే ఈర్ష్య

వారికి దక్కలేదనే ఈర్ష్య

సౌత్ లో రజనీకాంత్, కమల్‌హాసన్‌ లాంటి స్టార్లు ఉన్నారు...ఇంకెందరో ప్రముఖులు ఉన్నారు. వారిని కాట్టించుకోకుండా ప్రభాస్ కు మైనపు విగ్రహం పెట్టడం ఏమిటి? ఆయన స్థాయి ఏమిటి? అంటూ విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు.

బాహుబలి-2

బాహుబలి-2

బాహుబలి 2 మూవీ రిలీజ్ సమయానికి ప్రభాస్ మైనపు విగ్రహం మ్యూజియంలో కొలువుతీరనుంది. మొత్తానికి ప్రభాస్ బాహుబలితో వరల్డ్ సెలబ్రిటీ అయిపోయాడన్నమాట.

English summary
They are feeling Jealous on Prabhas wax statue at Madame Tussauds.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu