గన్స్‌తో వచ్చారు.. గాలిలోకి కాల్పులు.. ఏం జరిగేదో తలచుకుంటేనే..
శుక్రవారం జైపూర్ లోని కోటలో పద్మావతి చిత్రం షూటింగ్ జరుగుతుండగా భన్సాలీపై కర్నిసేనకు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.
'ఆందోళనకారులు తుపాకులతో వచ్చారు. పరిస్థితి ఇంకాస్త అదుపు తప్పితే ఏం జరిగేదో ఊహించడానికి భయమేస్తున్నది' అని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అన్నారు.
శుక్రవారం జైపూర్ లోని కోటలో పద్మావతి చిత్రం షూటింగ్ జరుగుతుండగా భన్సాలీపై కర్నిసేనకు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

షూటింగ్ లో ఆ రోజు జరిగిన భయానక సంఘటనను గుర్తు చేసుకొంటూ 'నిరసనకారుల గుంపు అన్నిటికి తెగించి వచ్చారు. గాలిలోకి కాల్పులు జరిపారు. బుల్లెట్ దాడుల నుంచి యూనిట్ సభ్యులు తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది' అని తెలిపారు.
sanjay leela bhansali padmavati jaipur karni sena attack సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి జైపూర్ కర్నిసేన దాడి

Click it and Unblock the Notifications