»   » రామ్ చరణ్....జీవితంలో మళ్లీ ఆ పని చేస్తే ఒట్టు!

రామ్ చరణ్....జీవితంలో మళ్లీ ఆ పని చేస్తే ఒట్టు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాలో, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ సినిమాపై జోకులు పేలుతున్నాయి. ఒక రకంగా చెప్పలంటే 'జంజీర్' చిత్రం విషయంలో మీడియా వర్గాల మధ్య పెద్ద వార్ జరుగుతుందనే చెప్పొచ్చు.

  నేషనల్ మీడియాలోని కొందరు ఈ సినిమాకు చాలా బాగుందని 4 స్టార్ రేటింగ్ ఇస్తే....మరికొందరు చెత్తగా ఉదంటూ సున్నా రేటింగ్ ఇచ్చారు. బాక్సాఫీసు వద్ద జంజీర్ చిత్రం తుస్ మనడంతో.....4 స్టార్ల రేటింగ్ ఇచ్చిన తలపండిన విశ్లేషకులు డైలమాలో పడ్డారు. ఇదే అదునుగా సున్నా రేటింగ్ ఇచ్చిన మరో వర్గం మీడియా కార్టూన్ల రూపంలో ఎక్కువ రేటింగ్ ఇచ్చిన వారిపై సెటైర్లు విసురుతోంది. అసలు రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం విషయంలో ఇంత రచ్చ జరుగడానికి కారణం అది ది గ్రేట్ యాక్టర్ అమితాబ్ నటించిన గొప్ప చిత్రానికి రీమేక కావడమే.

  జంజీర్ ఇచ్చిన ఫలితాలను చూస్తుంటే....ఇక లైఫ్‌లో రామ్ చరణ్ మళ్లీ రీమేక్ చిత్రాల జోలికి వెళ్లబోడని స్పష్టం అవుతోంది. అయితే రామ్ చరణ్ పరస్థితి చూసి చాలా మంది జాలి పడుతున్నారు. టాలెంట్ ఉండి, అర్హత ఉండి కూడా రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇలాంటి ఫలితాలను ఇవ్వడం చాలా మందిని నిరాశ పరిచింది. దీన్ని బట్టి రామ్ చరణ్ కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, తన తండ్రి మెగాస్టార్ స్థాయిని అందుకోవాలంటే ఆచితూచి ముందడుగు వేయాలని స్పష్టం అవుతోంది.

  English summary
  Nothing did save the fate of director Apoorva Lakhia's movie Zanjeer remake, that fell flat miserably at the cash counter collections. Not to blame the audience, the film itself was so lame and disappointing that a few film critics even did not think twice before rating the movie nil, A BIG ZERO.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more