»   » భలే క్రేజ్:'కనుపాప' చిత్రం రీమేక్ లో అజయ్ దేవగన్

భలే క్రేజ్:'కనుపాప' చిత్రం రీమేక్ లో అజయ్ దేవగన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ రీమేక్ కింగ్ సల్మాన్ ఖాన్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ బిరుదులో షేర్ కోసం ట్రై చేస్తున్నట్లున్నాడు అజయ్ దేవగన్. సల్మాన్ తో సమానంగా.. దక్షిణాది చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసి మంచి విజయాల్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అజయ్‌ దేవగణ్‌ కూడా తమిళ.. మలయాళం చిత్రాల్ని రీమేక్‌ చేసి హిట్‌ అందుకుంటున్నాడు.

అజయ్‌ ఇంతకుముందు తమిళ హీరో సూర్య సూపర్ హిట్ 'సింగం' రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న.. మోహన్‌లాల్‌ నటించిన 'దృశ్యం' రీమేక్‌లో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

This Actor To Reprise Mohanlal's Role In Oppam Hindi Remake!

ఇప్పుడు అదే నమ్మకంతో అదే మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం 'ఒప్పం' హిందీ రీమేక్‌లో నటించబోతున్నాడు.మలయాళంలో ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ఒప్పం'.

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్ర పోషించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంధుడైన లిఫ్ట్‌ ఆపరేటర్‌ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అతను ఆ హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నమే కథాంశం.

మాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని అజయ్‌ దేవగణ్‌ హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం 'బాద్‌షాహో' చిత్రంలో నటిస్తున్న అజయ్‌ అది పూర్తయిన తర్వాత ఈ చిత్రంలో నటిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

This Actor To Reprise Mohanlal's Role In Oppam Hindi Remake!

ఒప్పం విషయానికి వస్తే...మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ - ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో సెప్టెంబర్ 8న విడుదలైన ఒప్పం చిత్రం ఇప్పటి వరకు 50 కోట్లు వసూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

సంచ‌ల‌నం సృష్టించిన‌ ఒప్పం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు కానీ...రీమేక్ రైట్స్ ఎవ‌రికీ ఇవ్వ‌కుండా తెలుగులో క‌నుపాప అనే టైటిల్ తో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్, మన్యంపులి చిత్రాల విజ‌యాల‌తో మోహ‌న్ లాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో క‌నుపాప‌ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. జ‌న‌తా గ్యారేజ్, మన్యంపులి చిత్రాల‌తో వ‌రుసగా స‌క్సెస్ సాధించిన మోహ‌న్ లాల్ క‌నుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టెన్మెంట్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఒప్పం తెలుగు వెర్షన్ క‌నుపాప చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
As per the latest reports, popular Bollywood actor Ajay Devgn will reprise Mohanlal's role from Oppam, in the Hindi remake. The team is expected to make an official announcement about the Hindi star cast, soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X