»   » మహిళగా స్పందిస్తున్నా: హృతిక్, కంగన వివాదం పై యామీ గౌతమ్ బహిరంగ లేఖ

మహిళగా స్పందిస్తున్నా: హృతిక్, కంగన వివాదం పై యామీ గౌతమ్ బహిరంగ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లీగల్ వివాదం రోజురోజుకూ పెద్దదైపోతోంది. హృతిక్-కంగన 'ఎఫైర్'కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు హాట్ లవర్స్‌గా ముద్రపడిన వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై అనేక రహస్యాలెన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ వివాదంలో మొదటి నుంచి హృతిక్ ఒకటే మాట చెప్తున్నాడు. తనకు కంగనతో వృత్తిపరమైన సంబంధమే కానీ, వ్యక్తిగత సంబంధం లేదని, అలాంటి ఉద్దేశంతో ప్రవర్తించలేదని మొదటి నుండి వాదిస్తున్నాడు.అయితే కంగన వాదన వేరేగా ఉంది . పరస్పర విమర్శలతో గతేడాది వార్తల్లో ఈ జంట పతాక శీర్షికలో నిలిచింది. అయితే తప్పంతా క్వీన్‌దేనంటూ ఆమె మెయిల్స్ సాక్ష్యాలుగా చూపించాడు హృతిక్‌. అప్పటి నుంచి ఆ అంశం క్రమక్రమంగా గప్‌చుప్‌ అవుతూ వచ్చినా ఈ మధ్య కంగన నటించిన "సిమ్రన్" సినిమా ప్రమోషన్లలో మళ్ళీ ఈ వివాదం తెరమీదకి వచ్చింది. అంతే మళ్ళీ బాలీవుడ్ మరోసారి ఈ ప్రేమ యుద్దం వైపు చూపు తిప్పక తప్పలేదు.

ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది

ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది


ఈ నేప‌థ్యంలోనే మ‌రో బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ త‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హృతిక్‌తో `కాబిల్‌` చిత్రంలో నటించిన యామీ గౌత‌మ్ చేసిన‌ పోస్ట్ ప‌రోక్షంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తునిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. చ‌రిత్ర ఆధారంగా మ‌గాడిదే త‌ప్ప‌న‌డం స‌బ‌బు కాద‌ని, ఇలా చేస్తే లింగ స‌మాన‌త్వం కోసం చేస్తున్న పోరాటం త‌ప్పుదోవ ప‌డుతుంద‌ని, ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య విషయాన్ని సామాజిక అంశంగా మార్చొద్ద‌ని ఆమె పోస్ట్‌లో పేర్కొంది.

ఒక మ‌హిళగా ఈరోజు మాట్లాడాల్సి వ‌చ్చింది

ఒక మ‌హిళగా ఈరోజు మాట్లాడాల్సి వ‌చ్చింది

`సాధారణంగా సోష‌ల్ మీడియాలో నేను పెద్దగా మాట్లడ‌ను. కానీ ఒక మ‌హిళగా ఈరోజు మాట్లాడాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. బాలీవుడ్‌లో ఇద్ద‌రు ప్ర‌ముఖుల వివాదం న‌న్ను స్పందించేలా చేస్తోంది. వారిలో ఒకరితో క‌లిసి నేను ప‌నిచేశాను. అలాగ‌ని అత‌నికి మ‌ద్ద‌తుగా నేను మాట్లాడటం లేదు. ఒక మ‌హిళ‌గా స్పందిస్తున్నాను.

స‌మాజం అత‌న్ని నేరస్థుడిగా ఖ‌రారు చేసింది

స‌మాజం అత‌న్ని నేరస్థుడిగా ఖ‌రారు చేసింది

నాకు చ‌ట్టాల గురించి పెద్ద‌గా తెలియ‌దు. ఈ వివాదం గురించి కూడా పెద్ద‌గా తెలియ‌దు. కేవ‌లం మీడియాలో వ‌చ్చిన విష‌యాలు మాత్ర‌మే తెలుసు. వాటిని బ‌ట్టి చూస్తే ఆ ప్ర‌ముఖుల వివాదం లింగ స‌మాన‌త్వ అంశంగా మారిన‌ట్టు అర్థ‌మైంది. ఇప్ప‌టికే స‌మాజం అత‌న్ని నేరస్థుడిగా ఖ‌రారు చేసింది.

ఇలాంటి నిర్ణ‌యం స‌బ‌బు కాదు

ఇలాంటి నిర్ణ‌యం స‌బ‌బు కాదు

ఏళ్ల త‌రాలుగా మ‌హిళ‌ల మీద జ‌రుగుతున్న వేధింపు ఘ‌ట‌న‌ల ఆధారంగా స‌మాజం ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌బ‌బు కాదు. నిజానిజాల విచార‌ణ పూర్తి కాక‌ముందే ఇలా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్? లింగ స‌మాన‌త్వం అనే భావ‌న నిజాల‌ను క‌ప్పేస్తోంది. దీని వ‌ల్ల లింగ భేదానికి వ్య‌తిరేక జ‌రుగుతున్న పోరాటం త‌ప్పుదోవ పట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

సంయ‌మ‌నం పాటిద్దాం

సంయ‌మ‌నం పాటిద్దాం

ఈ పోస్ట్ ద్వారా నేను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. ఎవ‌రినీ కించప‌ర‌చ‌డం లేదు. ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య గొడ‌వ‌ను సామాజిక వివాదంగా మార్చొద్ద‌ని మాత్ర‌మే వేడుకుంటున్నాను. ఈ విష‌యంలో నిజానిజాలు బ‌య‌టికి వ‌చ్చే వ‌ర‌కు మ‌న‌మంతా సంయ‌మ‌నం పాటిద్దాం. ప్ర‌తి చిన్న విష‌యాన్ని లింగ స‌మాన‌త్వంతో ముడిపెట్ట‌డం వ‌ల్ల నిజ‌మైన లింగ భేద స‌మ‌స్య‌లు మ‌రుగునప‌డే ప్ర‌మాదం ఉంది` అని యామీ పోస్ట్ చేసింది.

English summary
Yami Gautam writes on ‘matter surrounding two of the biggest stars’ and we know it is Kangana Ranaut, Hrithik Roshan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu