»   » కరీనా కపూర్ లాచూపిస్తామని చెప్పి నాచేత బికిని వేయించారు దర్శకుడు..

కరీనా కపూర్ లాచూపిస్తామని చెప్పి నాచేత బికిని వేయించారు దర్శకుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ప్రియమణి నాగార్జున సరసన రగడ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ప్రిమయణిని ఇంటర్యూ చేసినప్పుడు తన మనసులోని భావాలను ఇలా పంచుకున్నారు. అంతేకాకుండా ద్రోణ సినిమాలో తనచేత అనవసరంగా బికిని వేయించి తనని విమర్శల పాలు చేశారని కూడా చెప్పారు. 'ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కినప్పుడు కలిగే ఆనందానికీ, తృప్తికి విలువ కట్టలేం. 'పరుత్తివీరన్" చిత్రానికి జాతీయ ఉత్తమనటిగా ఎంపికైనప్పుడు అలాంటి అనుభూతినే పొందాను. ప్రస్తుతం 'రక్తచరిత్ర" విజయం కూడా దాదాపు అలాంటి అనుభూతినే ఇచ్చింది" అంటున్నారు ప్రియమణి. 'రక్తచరిత్ర" చిత్రంలోని తన పాత్రకు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి స్పందన వస్తోందని, ఇది గ్లామర్ తారగా కాకుండా, ఒక నటిగా నేను సాధించిన విజయం అని చెప్పారు ప్రియమణి. ఇంకా ఆమె మాట్లాడుతూ 'ఇంకొన్ని రోజుల్లో వెళ్లిపోతున్న ఈ 2010 నా జీవితంలో మరచిపోలేని సంవత్సరం.

మణిరత్నం, రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి గోప్ప దర్శకులతో పనిచేసే అవకాశం ఇచ్చిన సంవత్సరం ఇది. అందుకే నా లైఫ్‌లో ఇదొక మెమరబుల్ ఇయర్ అన్నారు. మరికొన్ని విషయాలను ప్రియమణి చెబుతూ నాకు నటన అంటే ఇష్టం. తొలినాళ్లలో కొన్ని పరాజయాలు నాకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇక నటన జోలికి వెళ్లకుండా మోడలింగ్ వైపే దృష్టిపెడదాం అనుకున్నాను. అలాగే చే శాను కూడా. కానీ ఏదో తెలియని వెలితి. నేను చేస్తుంది కరెక్ట్ కాదని అనిపించింది. ఆ సమంలోనే పరుత్తివీరన్ అవకాశం వచ్చింది. ఆ విజయం నా జీవితాన్నే మార్చేసిన విషయం తెలిసిందే అని గతాన్ని నెమరువేసుకున్నారు ప్రియమణి.

"ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఒలికించక తప్పదు. అందుకే స్థిరత్వం కోసం గ్లామర్ బాట పట్టాను. కానీ కొన్ని సందర్భాల్లో కొందరి మాటలు నన్ను పక్కదారి పట్టించాయి. బికినీలంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. 'ద్రోణ"కు ముందు బికినీలో ఎవరైనా కనిపించారా అనే విషయం కూడా తెలీదు. 'స్టైల్‌గా పాటను తీస్తాం... 'తుషార్" చిత్రంలో కరీనా కపూర్‌లా మిమ్మల్ని చూపించాలనేది నా తపన" అని నాతో బికినీలో నటింపజేశారు ఆ చిత్ర దర్శకుడు. కానీ తర్వాత నేను ఎదుర్కొన్న విమర్శలు నాకు ఎంతో బాధ కలిగించాయి. అందుకే ఇక నుంచి గ్లామర్ విషయంలో కూడా కొన్ని పరిధులను పాటించాలనుకుంటున్నాను"" అని చెప్పుకొచ్చారు ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి సుమంత్ సరసన రాజ్, కింగ్ నాగార్జున సరసన రగడ సినిమాలలో హీరోయిన్ గానటిస్తున్నారు.

English summary
Drona being produced by DS Rao and directed by Karuna Kumar, Priyamani, the National Award winner for Best Actress, appears in a bikini. These scenes have recently been canned. Nitin plays the male lead in the film. Priyamani who would be seen in this costume in her flick Drona.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu