పవన్‌తో పాటు కొడుకుతో లింక్: అందుకే రేణు దేశాయ్‌కి చాలా స్పెషల్!
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
హైదరాబాద్: ప్రముఖ సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ 'అకీరా' ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభం అయినా ఎందుకో బాగాలేటయింది. ఎట్టకేలకు ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లానప్ చేసారు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ట్విట్టర్లో స్పందించారు. ఈ సినిమాతో తనకు ఎటువంటి సంబంధం లేక పోయినా...ఈ సినిమా పేరు, రిలీజ్ డేట్ ఆమెకు చాలా క్లోజ్. అందుకే ఆమె ట్విట్టర్లో స్పందించారు.
రేణు దేశాయ్ కుమారుడి పేరు అకీరా. ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ.....అనుకోకుండా అకీరా పేరుతో మ్యాచ్ అయింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్త పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. అలా అనుకోండా ఈ సినిమాకు సంబంధించిన పేరు, రిలీజ్ డేట్ తనకు చాలా క్లోజ్ కావడంతో ఆమె స్పందించారు.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయినా... ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేస్తున్నారు. తమ పిల్లల కోసం మంచి తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరచూ వచ్చి పుణెలో రేణు దేశాయ్ వద్ద ఉంటున్న తన పిల్లలను కలుస్తున్నారు.
The first look poster of A R Murugadoss' Hindi project, Akira, starring Sonakshi Sinha was released early today. The film which has been under the cans for a long time is finally going to see light in September. And, you might have already guessed why it is special for Renu Desai. The former actress and a mother of two tweeted about the coincidence, when a fan-boy tweeted it to her.
Story first published: Tuesday, June 21, 2016, 17:00 [IST]